Hezbollah:హెజ్‌బొల్లాను కూకటివేళ్లతో పెకిలిస్తున్న ఇజ్రాయెల్

Hezbollah:హెజ్‌బొల్లాను కూకటివేళ్లతో పెకిలిస్తున్న ఇజ్రాయెల్
X
హిజ్‌బొల్లా చీఫ్ ను అంతమొందించిన ఇజ్రాయెల్...దాడులు కొనసాగుతాయని స్పష్టీకరణ

హెజ్ బొల్లాను అంతం చేసే వరకూ దాడులు ఆపేది లేదని ప్రతిన బూనిన ఇజ్రాయెల్.. లక్ష్యాన్ని చేరుకునే దిశగా పయనిస్తోంది. హెజ్ బొల్లాను కూకటివేళ్లతో పెకిలిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే హెజ్ బొల్లా టాప్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ బలగాలు.. ఇప్పుడు ఆ సంస్థ చీఫ్‌ను, ఆయన కుమార్తెను కూడా హతమార్చాయి. ఐక్యరాజ్య సమితిలో నెతన్యాహు ప్రసంగించిన గంటల్లోనే హెజ్ బొల్లా చీఫ్ హతమవ్వడం విశేషం.

భీకర దాడులు

హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ భీకర స్థాయిలో దాడులు చేసింది. దక్షిణ లెబనాన్‌ దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్‌ ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లా మరణించినట్లు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హిజ్‌బొల్లా అధినేత హ‌స్సన్ న‌స్రల్లా హతమైనట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది. హిజ్‌బొల్లా చీఫ్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్‌ ఏకంగా 80 టన్నులకుపైగా బాంబులను వాడారు. బీరుట్‌లో ఉన్న బిల్డింగ్‌లపై వైమానిక దాడులకు పాల్పడింది. ఆ సిటీలో ఉన్న హిజ్‌బొల్లా క‌మాండ్ సెంట‌ర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జ‌రిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. సుమారు 80కిపైగా బాంబులను హిజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై వేసినట్లు వెల్లడించింది. బంకర్లలోకి చొచ్చుకెళ్లేంత బరువు ఉన్న బాంబులను ఐడీఎఫ్‌ వాడినట్లు పేర్కొంది. ఒక్కో బాంబు సగటున ఒక టన్ను బరువు ఉంటుందని తెలిపింది.

తమ దాడుల్లో హిజ్‌బొల్లా చీఫ్‌ హతమైనట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ధ్రువీకరించింది. హసన్‌ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరంటూ ఐడీఎఫ్‌ ట్వీట్‌ చేసింది. నస్రల్లా హతం వేళ ఇరాన్‌ అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా తన సుప్రీమ్‌ లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించినట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అదే సమయంలో నస్రల్లా హతం వేళ తదుపరి కార్యాచరణ విషయంలో హిజ్‌బొల్లా, ఇతర సంస్థలతో ఇరాన్‌ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సరదు అధికారులు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.

ఇరాన్‌లో హై అలర్ట్‌

ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లాల మధ్య జరుగుతోన్న పోరుతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు హెజ్‌బొల్లా చీఫ్ హసన్‌ నస్రల్లాను ఇజ్రాయెల్‌ దళాల మట్టుపెట్టిన నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమవుతుంది. ఇజ్రాయెల్ వరుస దాడుల నేపథ్యంలో ఖమేనీ అత్యవసర సమావేశం నిర్వహించారు.

Tags

Next Story