Russia- Ukrain War: రష్యా చెరలో మూడు నెలలు.. ఉక్రెయిన్ సైనికుడి పరిస్థితి విషమం..

Russia- Ukrain War: రష్యా క్రూరత్వం నుండి విముక్తి పొందిన ఉక్రేనియన్ సైనికుడి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార దాహంతో విర్రవీగుతున్న రష్యాను ప్రపంచవ్యాప్త పౌరులు తప్పుపడుతున్నారు.
మైఖైలో డయానోవ్ అనే ఉక్రేనియన్ సైనికుడు మారియుపోల్ యుద్ధం తరువాత రష్యన్ జైలు శిబిరాల్లో నాలుగు నెలలు దుర్భర జీవితాన్ని గడిపాడు. ఈ వారంలో ఒక ప్రధాన ఖైదీల మార్పిడిలో విడుదలయ్యాడు.
ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఉక్రేనియన్ సైనికుడు మైఖైలో డయానోవ్ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అతను గాయాలతో బయటపడ్డాడు.. అదృష్టవంతుడు అనితోటి యుద్ధ ఖైదీలు ఇంకా రష్యన్ చెరలోనే ఉన్నారు అని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ రాసింది.
మైఖైలో డియానోవ్‌ను కైవ్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారని, అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని మీడియా నివేదికలు తెలిపాయి. నుండి మారియుపోల్ పోర్ట్ సిటీలోని అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోవడానికి పంపిన 2,000 మంది సైనికులలో డయానోవ్ కూడా ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com