Saudi Arabia: సౌదీ అరేబియాలో ఈదురు గాలులు..

సౌదీ అరేబియా లోని ప్రధాన నగరాల్లో తీవ్ర గాలులు,ఉరుములు,మెరుపులు కాసేపు విధ్వంసం సృష్టించాయి. రోడ్లపై భారీ హోర్డింగులు, టవర్లు నేలకొరగడంతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది.ఆధ్యాత్మికంగా ప్రసిద్ధ నగరాలైన జెద్దా, మక్కాలలోనూ భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
గాలి వాన జనాలందరినీ ఈడ్చి పడేసింది. భారీ వస్తువులు సైతం ఆ గాలి తాకిడికి ఎగిరిపోయాయి.మక్కా మసీదులో ప్రార్థనకు వచ్చిన వారు కూడా గాలుల బారిన పడ్డారు. రోడ్లపై ఉన్న భారీ హోర్డింగ్‌లు, కరెంట్ పోల్స్ ఎగిరి వాహనాలపై పడ్డాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. రోడ్లపై నడుస్తూ ఉండగానే కొంత మంది గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు.
జెడ్డాలో ఈ గాలులకు తోడు ఇసుక తుపాను ముంచెత్తింది. భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయని సౌదీ అరేబియా వాతావరణ శాఖ తెలిపింది.మరో 24 గంటల పాటు అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశముందని అలర్ట్ జారీ చేసింది. మదీనా, మక్కా, ఆసిర్, జాజన్, అల్ బహా తదితర నగరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వర్షసూచనతో అధికారులు అలర్టయ్యారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని విఙ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మక్కా, థువల్, జెడ్డా, రబీగ్ గవర్నరేట్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Tags
- saudi arabia
- rain in saudi arabia
- heavy rains in saudi arabia
- very heavy rain with powerful winds in saudi arabia
- heavy rain in makkah
- heavy rain
- #saudi arabia
- saudi arabia news
- saudi arabia flood
- strong winds and torrential rain in saudi arabia
- storm and heavy rains caused flooding in saudi arabia
- sandstorm in saudi arabia
- sand storm in saudi arabia
- life in saudi arabia
- heavy rain in makkah today
- flood in saudi arabia
- sandstorm in riyadh saudi arabia
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com