Florida: మెడికల్ రెస్క్యూ హెలికాప్టర్‌లో మంటలు

Florida:  మెడికల్ రెస్క్యూ హెలికాప్టర్‌లో మంటలు
ఇద్దరు మృతి..నలుగురికి గాయాలు

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వైద్య సైవలకు సంబంధించిన హెలికాప్టర్ కుప్పకూలింది. మెడికల్ రెస్క్యూ హెలికాప్టర్‌లో మంటలు చెలరేగడంతో పాటు ఫోర్ట్ లాడర్‌డేల్ సమీపంలోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పారామెడిక్ కెప్టెన్, అపార్ట్మెంట్ లో ఉన్న మరో వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.


ఈ ఘటనను అగ్నిమాపకశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగలు అలముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. హెలికాప్టర్ ఓ ఇంటిపై పడటంతో కొంత మేర ఆ నిర్మాణం ధ్వంసమైంది. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించామని, ప్రాణాలతో బయటపడతారని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ రెస్క్యూ హెలికాప్టర్ నార్త్ లాడర్‌డేల్‌లోని ఘటనా స్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు. పొంపనో బీచ్ మయామికి ఉత్తరాన 40 మైళ్ల దూరంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story