Helicopter Crash: ఎవరెస్ట్ వద్ద కుప్పకూలిన హెలికాఫ్టర్

నేపాల్ మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిందని అధికారులు ప్రకటించారు. అందులో పైలెట్ తోపాటు మరో ఐదుగురు మెక్సికన్ దేశస్థులు ఉన్నట్లు తెలిపారు. ఎవరెస్ట్ సహా ఎత్తైన పర్వత శిఖరాలకు నిలయమైన సోలుకుంభు జిల్లాలోని సుర్కు విమానాశ్రయం నుంచి కాఠ్ మాండూకు బయలుదేరిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వివరించారు.
ఉదయం 10.15గంటలకు హెలికాప్టర్ 12వేల అడుగుల ఎత్తులో ఉండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. లమ్జురాపాస్ వద్దకు చేరుకున్నాక వైబర్ పై హల్లో సందేశం మాత్రమే రావటంతో అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ జాడ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పెద్దశబ్ధంతో హెలికాప్టర్ కూలిపోయినట్లు స్థానికుల నుంచి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో మంటలు లేచినట్లు చెప్పారు. సోలుఖుంబు జిల్లాలోని భకంజే గ్రామంలోని లాంజురాలో హెలికాప్టర్ శిథిలాలు లభ్యమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com