Afghan journalist: ఆ రోజు ఏం జరిగిందంటే..: అఫ్గాన్ జర్నలిస్ట్

Afghan journalist: ఆ రోజు ఏం జరిగిందంటే..: అఫ్గాన్ జర్నలిస్ట్
విమానాలు ఉన్నప్పటికీ, వాటిని నడపడానికి పైలట్ అందుబాటులో లేడు.

రన్‌వేపై వేలాది మంది, భయంతో సహాయం కోసం చూస్తున్నారు. తుపాకీ కాల్పుల మోత దద్దరిల్లుతోంది. ... అఫ్గాన్ జర్నలిస్ట్ రామిన్ రెహమాన్ (27) తాలిబాన్ నియంత్రణలోకి వచ్చిన రోజున హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి యుఎస్ విమానంలో తప్పించుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

మేము కాబూల్ విమానాశ్రయంలో ఉన్నాము. వేలాది మంది గుమిగూడారు. తాలిబాన్ల రాకతో అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానాలు ఉన్నప్పటికీ, వాటిని నడపడానికి పైలట్ అందుబాటులో లేడు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక ప్రైవేట్ సంస్థ యాజమాన్యంలోని కేవలం ఒక విమానం మాత్రమే ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. పెద్ద సంఖ్యలో వ్యక్తులు దానిలోకి దూసుకెళ్లారు.

ఆ విమానంలో 1,000 మందికి పైగా చేరిపోయారు. ప్రజలు విమానం లోపల తోసుకుంటున్నారు. విమానం మెట్ల మీద నుండి వేలాడుతున్నారు. విమానం రాజకీయ నాయకులతో నిండిపోయింది. వారి వ్యక్తిగత గార్డ్లులు పౌరులను మెట్లపై నుండి నెట్టారు.

నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మరికొంత మంది ప్రార్థిస్తున్నారు. ఏం చేయాలో ఎవరికీ తెలియదు. విమానం టేకాఫ్ అయిన తరువాత అమెరికన్ పైలెట్ల పట్ల ప్రశంస భావన కలిగింది. బహుశా ఆ విమానం రాకపోతే మేమంతా ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. తాలిబన్ల బారినుంచి బయటపడినందుకు నేను చాలా సంతోషించాను అని తన భయానక అనుభవాలను జర్నలిస్ట్ రెహమాన్ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story