Hezbollah-Israel war: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా రాకెట్ల ప్రయోగం

Hezbollah-Israel war: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా  రాకెట్ల ప్రయోగం
X
ఒకరి మృతి.. ఇళ్లు ధ్వంసం

ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌ ఆక్రమిత గోలన్‌ హైట్స్‌ పీఠభూమి ప్రాంతంపై లెబనాన్‌లోని హెజ్‌బొల్లా బుధవారం 50కిపైగా రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ వ్యక్తి గాయపడ్డారు. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయక సిబ్బంది సత్వరం స్పందించడంతో పెను ముప్పు తప్పిందని గోలన్‌ హైట్స్‌ అధికార వర్గాలు తెలిపాయి. లెబనాన్‌పై మంగళవారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాము తాజాగా రాకెట్ల వర్షం కురిపించామని హెజ్‌బొల్లా వెల్లడించింది.

ఎర్ర సముద్రంలో గ్రీస్‌ చమురు ట్యాంకరుపై యెమెన్‌లో తీరంలో బుధవారం దాడులు చోటుచేసుకున్నాయని బ్రిటన్‌ తెలిపింది. ఈ దాడులు హూతీ తిరుగుబాటుదారుల దుశ్చర్యలే అయ్యుంటాయని అనుమానం వ్యక్తం చేసింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్లను ప్రయోగించింది. ఈ రాకెట్లు గోలన్ హైట్స్‌ను తాకాయి. దీంతో ప్రైవేటు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా బుధవారం ఈ దాడి జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో 19 మంది గాయపడ్డారు. గాజాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య గత 10 నెలలుగా తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇటీవల హమాస్ అగ్ర నేత హనియే, అలాగే హిజ్బుల్లా అగ్ర నేతలు మృతి చెందారు. దీనికి ఇజ్రాయెల్‌ కారణమని భావిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌లో హనియే హతం కావడంతో ఇజ్రాయెల్‌పై పగతో రగిలిపోతున్నారు. ఏదొక క్షణంలో ఇరాన్ దాడులకు తెగబడవచ్చని అమెరికా భావిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై అమెరికా అండగా నిలిచింది.

Tags

Next Story