మెట్రోలో హిజాబ్ వివాదం.. కోమాలో ఉన్న 16 ఏళ్ల బాలిక

మెట్రోలో హిజాబ్ వివాదం.. కోమాలో ఉన్న 16 ఏళ్ల బాలిక
ఇరాన్ దేశంలో చోటుచేసుకున్న హిజాబ్ వివాదం కారణంగా జరిగిన ఘర్షణలో యువతి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

కొన్ని మతాల్లో ఆచారాలు చాలా కఠినంగా ఉంటాయి. తమ మత సంబంధమైన ఆచారాలు పాటించకపోతే ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు. గత కొంత కాలంగా చెలరేగిన హిజాబ్ వివాదం ఇంకా చల్లారలేదు. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట దీనికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇరాన్ దేశంలో చోటుచేసుకున్న హిజాబ్ వివాదం కారణంగా జరిగిన ఘర్షణలో యువతి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ యువతి కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అర్మితా గరావాండ్ ఆదివారం ఉదయం ఇరాన్ రాజధాని షోహదా మెట్రో స్టేషన్‌లో ట్రెయిన్ ఎక్కింది. ఆమె హిజాబ్ ధరించలేదు. తలపై ఒక స్కార్ఫ్ లాంటిది వేసుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ స్త్రీల కోసం కఠినమైన నియమాలను రూపొందించింది. దీని ప్రకారం వారు హిజాబ్ తప్పక ధరించాలి. అర్మితా హిజాబ్ ధరించకపోవడంతో ఆమె మీద చేయి చేసుకున్నారు కొందరు ఇస్లామీయులు. తీవ్రగాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు టెహ్రాన్‌లోని ఫజ్ర్ ఆసుపత్రిలో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని మానవ హక్కుల సంస్థ హెంగావ్ మంగళవారం నివేదించింది.

హెంగావ్ ప్రకారం, కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సందర్శనలు నిషేధించబడినందున, వారే ఆమెను దగ్గరుండి చూసుకుంటున్నారు. తక్కువ రక్తపోటు కారణంగా అర్మితా స్పృహతప్పి పడిపోయినట్లు అధికారిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఆమె తండ్రి బహ్మాన్, ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగినట్లు మాకు తెలిసింది. మా బిడ్డ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించమని ప్రజలను కోరుతున్నాను అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story