Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ ఆటోడ్రైవర్ హత్య..

Bangladesh:  బంగ్లాదేశ్‌లో  హిందూ ఆటోడ్రైవర్ హత్య..
X
కొట్టి చంపిదన దుండగులు..

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. మరో హిందూ యువకుడిని కొట్టి చంపారు. ఆటోడ్రైవర్ అయిన 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్‌ను పథకం ప్రకారం కొట్టి చంపినట్లు తేలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చిట్టగాంగ్‌లోని దగన్‌భూయాన్‌లో జరిగింది. దాడి చేసిన దుండగులు మొదట దాస్‌ను కొట్టి, ఆపై కత్తితో పొడిచి చంపారు. దీని తర్వా ఆతడి ఈ-ఆటో రిక్షాతో పారిపోయారు. ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నిందితుల్ని గుర్తించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైమన్‌సింగ్ నగరంలో దీపుచంద్ర దాస్ హత్యతో మొదలైన ఈ మారణకాండకు అడ్డుకట్టపడటం లేదు. గడిచిన 40 రోజుల్లో 10 మందికి పైగా హిందువుల హత్యలకు గురయ్యారు. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య మండలి, దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాలపై పెరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మైనారిటీలపై హింసాత్మక దాడులు ఎక్కువయ్యాయి.

బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీల పట్ల బంగ్లా తీరును భారత్ తీవ్రంగా విమర్శిస్తోంది. బంగ్లా తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ ఈ మారుణకాండను అడ్డుకోవడం లేదు. పైగా భారత్ వీటిని ఎక్కువ చేసి చూపిస్తోందని యూనస్ ఆరోపిస్తున్నాడు. “బంగ్లాదేశ్‌లోని తీవ్రవాదులు మైనారిటీలపై, వారి ఇళ్ళు, సంస్థలు, వ్యాపార సంస్థలపై ఆందోళనకరమైన దాడులను మేము చూస్తూనే ఉన్నాము. ఇటువంటి మత సంఘటనలను త్వరగా మరియు దృఢంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం అన్నారు.

Tags

Next Story