Pakistan : పాకిస్తాన్‌‌లో దారుణం.. బాలిక కిడ్నాప్‌కు యత్నం.. ప్రతిఘటించడంతో

Pakistan : పాకిస్తాన్‌‌లో దారుణం.. బాలిక కిడ్నాప్‌కు యత్నం.. ప్రతిఘటించడంతో
Pakistan : పాకిస్తాన్‌‌లో దారుణం చోటుచేసుకుంది. మైనారిటీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన దాడిలో 18 ఏళ్ల పూజా ఓడ్ అనే బాలికని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.

Pakistan : పాకిస్తాన్‌‌లో దారుణం చోటుచేసుకుంది. మైనారిటీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన దాడిలో 18 ఏళ్ల పూజా ఓడ్ అనే బాలికని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. యువతిని ముందుగా కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. కానీ ఆమె ప్రతిఘటించడంతో కాల్పులు జరిపారు. దీనితో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది.

ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రిస్టియన్ మతాలకు చెందిన వారిని బలవంతంగా అపహరించి, మత మార్పిడులకు పాల్పడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలను నిత్యం అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని, మతమార్పిడుల సమస్యను చాలాకాలంగా ఎదుర్కొంటున్నాయని మానవ హక్కుల సంఘం పేర్కొంది.

హిందువులు మరియు ఇతర మైనారిటీలపై పెరుగుతున్న నేరాలపై పాకిస్తాన్ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని బహుళ హక్కుల సంస్థలు ఆరోపించాయి. పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందూ కమ్యూనిటీ 1.60 శాతం, సింధ్‌ ప్రావిన్స్‌లో 6.51 శాతం ఉన్నాయి. పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. అధికారిక అంచనాల ప్రకారం 75 లక్షల మంది హిందువులు పాకిస్థాన్‌లో నివసిస్తున్నారు.

Tags

Next Story