nuclear explosions: చరిత్రలో అతిపెద్ద మారణహోమానికి 78 ఏళ్లు

nuclear explosions: చరిత్రలో అతిపెద్ద మారణహోమానికి 78 ఏళ్లు
: నేటితో అమెరికా అణుబాంబు దాడి చేసి 78ఏళ్ళ.. మహా విధ్వంసం చూసి వణికిపోయిన ప్రపంచం

1945 ఆగష్టు 6‍(Hiroshima day‌), చరిత్రలో మరచిపోలేని రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచంలోనే అమెరికా(United States ) మొట్టమొదటిసారిగా అణుబాంబుని ప్రయోగించి దేశాలన్నింటినీ భయంతో వణికించిన రోజది. మానవ చరిత్రలో అతిపెద్ద మారణహోమాల్లో ఒకటైన జపాన్‌ నగరం హిరోషిమాపై బాంబు దాడి( bomb dropped on Hiroshima) జరిగింది ఆ రోజునే. ఆ దారుణం జరిగి నేటికి 78 ఏళ్లు పూర్తైంది. ఆగస్టు ఆరున హిరోషిమాపై, ఆగస్టు 9న నాగసాకిపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు సుమారు 2 లక్షలకుపైగా జపాన్‌ పౌరులను బలితీసుకున్నాయి. పెరల్‌ హార్బర్‌పై దాడికి ప్రతీకారంగా అణు దాడులతో జపాన్‌కు అమెరికా తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఆ మహావిషాదం తాలూకు చేదు జ్ఞాపకాలు నేటికీ జపాన్‌ను వెంటాడుతూనే ఉన్నాయి.


ఆసియా దేశమైన జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణు బాంబును వేసిన తేదీ. మళ్ళీ మూడు రోజుల తరువాత రెండవ బాంబు జపాన్‌లోని నాగసాకి నగరం(Hiroshima and Nagasaki)పై వేసింది. అణుబాంబు దాడితో రెండు నగరాలు ధ్వంసమయ్యాయి. పూర్తిగా శిథిలమయ్యాయి. ఎక్కడ చూసినా మరణ ఘోష.. దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే లక్షన్నర మందికి పైగా చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన వారు వికలాంగులయ్యారు. అణుబాంబు దాడి ప్రభావం వాతావరణంపై కూడా పడింది. ఆ నగరాల్లో అనేక దశాబ్దాలుగా కొనసాగింది.


రెండవ ప్రపంచ యుద్ధం 1939(During World War II)లో ప్రారంభమై.. 1945 వరకు సాగింది. పెరల్‌ హార్బర్‌పై 1941 డిసెంబర్‌ 7న జపాన్ దాడి చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం బరిలోకి అమెరికా దిగింది. జపాన్‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఐరోపాలో విజయం సాధించి జోరు మీదున్న అగ్రరాజ్యానికి లొంగిపోయేందుకు జపాన్ ఇష్టపడలేదు. దీంతో 1945 ఆగస్టు ప్రారంభంలో హిరోషిమా నాగసాకి నగరాలపై అణు బాంబులు వేయడానికి అమెరికా నిర్ణయించుకుంది. తొలుత 1945 ఆగస్టు 6న హిరోషీమా నగరంపై లిటిల్‌ బాయ్‌ అనే అణ్వాయుధం‍Little Boy" on Hiroshima ‌)తో అణుదాడి చేసింది. ఈ దాడిలో లక్షా 40వేల మంది మరణించారు. మరో మూడు రోజుల వ్యవధిలో ఆగస్టు ‍9న నాగసాకిపై ఫ్యాట్‌మ్యాన్‌ అనే మరో అణు బాంబుతో దాడి చేసింది. ఈ దాడితో కనులు మూసి తెరచే లోగా.. నగరం బూడిదగా మారింది. సుమారు 80 వేల మందికి పైగా మరణించారు.


ఈ అణుబాంబు దాడి అనంతరం వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించింది. అణు రేడియేషన్ కారణంగా వ్యాధులతో ప్రజలు మరణించారు. ఇలా అనేక దశాబ్దాలపాటు కొనసాగింది. సంవత్సరాల తరబడి ప్రభావం అణు దాడి తర్వాత 30 కి.మీ ప్రాంతంలో నల్లటి వర్షం కురిసింది. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు రేడియేషన్ బారిన పడ్డారు. అణుబాంబు పేలుళ్ల కారణంగా అప్పటికప్పుడు చాలా మంది మరణిస్తే..మిగిలిన వారంతా రేడియేషన్‌ ప్రభావానికి గురై ప్రాణాలు విడిచారు.

Tags

Read MoreRead Less
Next Story