Hollywood: అంతరిక్షంలో షూట్‌కు రెడీ అవుతున్న హాలీవుడ్ మూవీ..

Hollywood: హాలీవుడ్ స్టార్ టామ్‌క్రూయిజ్ తన నెక్ట్స్ మూవీలో ఒక సీక్వెన్స్‌ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్ చేయబోతున్నారన్న వార్త వైరల్ అయింది. అయితే ఆ సినిమా కంటే కంటే ముందే రష్యన్ మూవీ ఈ ఘనత సాధించేసింది. రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో తెరకెక్కిస్తున్న సినిమా ద చాలెంజ్‌లో ఒక సీక్వెన్స్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో తీశారు. ఇందుకోసం మూవీ టీం 12 రోజుల పాటు ISSలో గడిపారు.
స్పేస్‌లో షూటింగ్ చేసుకున్న మొదటి సినిమాగా ద చాలెంజ్ రికార్డు సృష్టించింది. లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఓ కాస్మొనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఇందులో యాక్ట్ చేస్తోంది. షూట్ కోసం సినిమా బృందం ఐఎస్‌ఎస్‌లో లాండైన తీరును కూడా సినిమాలో చూపించారు. ఈ అడ్వంచర్ ఇచ్చిన స్పూర్తితో రానున్న కాలంలో చంద్రునితో పాటు అంగారకునిపైనా షూటింగ్ చేస్తానని డైరక్టర్ క్లిమ్ అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com