Ukraine : ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు..

ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయల్దేరింది స్పెషల్ ఫ్లైట్. తెల్లవారుజామున ఢిల్లీ, ముంబై నుంచి.. బయల్దేరి వెళ్లారు రెండు ఎయిరిండియా ప్రత్యేక విమానాలు. ఇవాళ రాత్రి 8 గంటలకు విద్యార్థులతో ముంబై చేరుకోనుంది తొలి విమానం. సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ నుంచి బుకారెస్ట్ వెళ్లనుంది మరో విమానం. ఒక్కో విమానంలో 235 నుంచి 240 మంది విద్యార్థులను తరలించనున్నారు. ఫ్లైట్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. భారత్ వస్తున్న విద్యార్థుల కోసం ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లలో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్, ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. రెండూ లేని వారికి ఎయిర్‌పోర్ట్‌లోనే టెస్టులు చేస్తారు. కోవిడ్ నెగటివ్ ఉంటేనే ఎయిర్‌పోర్ట్ వీడి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com