Honour killing: కూతుర్ని కడతేర్చిన తండ్రి

Honour killing: కూతుర్ని కడతేర్చిన తండ్రి
పరువు హత్య: ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు, కూతుర్ని కడతేర్చిన కసాయి తండ్రి' ; పాకిస్థాన్ లోని కరాచీలో చోటుచేసుకున్న పరువు హత్యగా


ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు, కన్న కూతుర్ని కాల్చి చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో జరిగింది. పరువు హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితున్ని అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ లోని గిరిజన ప్రాంతం వజీరిస్తాన్ కు చెందిన ఓ యువతి పొరుగున ఉన్న ఓ డాక్టర్ ను ఇష్టపడి వివాహం చేసుకుంది. యువతి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు.

పెళ్లి తర్వాత నవదంపతులు కరాచీలోని పిరాబాద్ లో నివసిస్తున్నారు. వివాహం చేసుకున్నట్లు ధృవీకరించడానికి నవదంపతులు కరాచీ కోర్టుకు వచ్చినప్పుడు ఆమె తండ్రి కాల్చిచంపాడు. "యువతి తన వివాహ స్టేంట్మెంట్ ను కోర్టులో రికార్డ్ చేయడానికి కోర్టుకు వచ్చినప్పుడు, ఆమె తండ్రి ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే చనిపోగా, ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు" అని ఎస్పీ షబ్బీర్ సేథర్ చెప్పారు.

నిందితున్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్ లో వివిధ ప్రాంతాల్లో ఏటా వందలాది మహిళలు పరువు హత్యకు గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 'హ్యూమన్ రైట్స్ ఆఫ్ పాకిస్థాన్' తెలిపిన వివరాల ప్రకారం, గత దశాబ్ధంలో సగటున 650 పరువు హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story