Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి..

అమెరికాలోని పలు ఆసుపత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది. న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహామా రాష్ట్రాల్లోని 20కిపైగా ఆసుపత్రుల్లో అర్డెంట్ హెల్త్ సర్వీసెస్ అనే సంస్థ వైద్య సేవలు, ఇతర సదుపాయాలను అందిస్తోంది. తాజాగా ఆయా ఆస్పత్రుల్లోని మెడికల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో ఆసుపత్రుల్లోని క్లినికల్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్ నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన సంస్థ.. సాఫ్ట్‌వేర్ సేవల్ని పునరుద్ధరించడానికి తమ సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అప్పటి వరకు సాధారణ వైద్యసేవలు కొనసాగుతాయని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ గదుల్లో ఉన్న రోగులకు మాత్రం ఇతర ఆస్పత్రులకు తరలించామని తెలిపింది. అత్యవసర పరిస్థితి లేని శస్త్రచికిత్సలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ సైబర్ దాడిలో ఎలాంటి సమాచారం చోరీకి గురైందో ఇప్పుడే చెప్పలేమని, దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నామని అర్డెంట్ కంపెనీ వెల్లడించింది.
అమెరికాలో పలు ఆసుపత్రులు ఒకేసారి సైబర్ దాడి బారినపడటం కలకలం రేపుతోంది. న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహోమా రాష్ట్రాల్లోని 20కి పైగా ఆసుపత్రుల్లో ఆర్డెంట్ హెల్త్ సర్వీసెస్ సంస్థ వైద్య సేవలు, ఇతర సదుపాయాలు అందిస్తోంది. అయితే, సైబర్ నేరగాళ్లు సంస్థకు చెందిన మెడికల్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడంతో ఆయా ఆసుపత్రుల్లోని వైద్య సేవలు నిలిచిపోయాయి.
కాగా, ఘటనపై స్పందించిన ఆర్డెంట్ హెల్త్ సర్వీసెస్ సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఎమర్జెన్సీ గదుల్లోని రోగులను ముందుజాగ్రత్తగా ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొంది. ఇతర రోగులకు శస్త్రచికిత్సలు వాయిదా వేసినట్టు తెలిపింది. సాధారణ వైద్య సేవలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక సైబర్ దాడిలో ఎలాంటి సమాచారం లీక్ అయ్యిందో ఇప్పుడే చెప్పడం కష్టమని ఆర్డెంట్ సంస్థ వెల్లడించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com