Putin : పోలెండ్ పై వాగ్నర్ గ్రూపు కన్ను

Putin : పోలెండ్ పై వాగ్నర్ గ్రూపు కన్ను
పుతిన్ తో భేటీ సందర్భంగా లుకషంకో వ్యాఖ్య

రష్యాలో వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్, బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకోతో భేటీ అయ్యారు. తిరుగుబాటు సమయంలో రష్యా నాయకత్వానికి, వాగ్న ర్‌ గ్రూప్‌ మధ్య దౌత్యం నిర్వహించింది లుకషెంకోనే. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు వాగ్నర్ అధినేత కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో వీరు భేటీ అయిన వీడియోను బెలారస్‌ మీడియా సంస్థవిడుదల చేసింది. ఈ సందర్భంగా అసలు ప్రతిఘటనే లేదు అన్న లుకషాంకో మాటకు పుతిన్ స్పందించారు. ప్రతిఘటన ఉండేది కానీ ఆ ఎదురుదాడులు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు.

సంధి జరిగిన నాటి నుండి ఇంతవరకు వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్‌ ఎక్కడా బయట కనిపించలేదు. దీనిపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల విడుదలైన కొన్ని వీడియోల ఆధారంగా ఆయన బెలారస్ లో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది అక్కడి సైన్యానికి శిక్షణ ఇస్తున్న వాగ్నర్‌ దళాలు పోలండ్‌ సరిహద్దుల్లో నాటో దళాలను వెనక్కు వెళ్లగొట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు తెలిపారు. పశ్చిమ దిశగా దాడులు చేద్దామని వాగ్నర్‌ సైనికులు చాలా ఒత్తిడి చేస్తున్నారని.. వార్సాకు వెళదామని చెబుతున్నారని అన్నారు. వారిని మధ్య బెలారస్‌లోనే నియంత్రిస్తున్నామని పుతిన్‌కు లుకషెంకో వివరించారు.


ఈ విషయం పై గతంలో రష్యా మాజీ సైన్యాధికారి ఆండ్రీ కర్తపోలోవ్ కొంత స్పష్టత ఇచ్చారు. వాగ్నర్ సైన్యం ప్రస్తుతం బెలారస్ లో ఉండడమే కరెక్టని, అక్కడ ఉంటేనే బెలారస్ సరిహద్దు ప్రదేశాలు పోలాండ్, లిథువానాలతోపాటు ఉక్రెయిన్ లోని నాటో ఆస్తులపై దాడి చేసే వీలుంటుందని, అది రష్యాకు కలిసొచ్చే అంశమేనని తెలిపారు.

మరోపక్క ఇదంతా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రణాళికలో భాగమని, దాని అనుసారంగానే తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్జెనీ ప్రిగోజిన్‌ను దేశం దాటించి అతని స్థానంలో మరొకరిని వాగ్నర్ బృందానికి నాయకుడిగా నియమించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వాగ్నర్‌ దళాలు బెలారస్‌లో అడుగుపెట్టాయని తెలియగానే.. పోలండ్‌ తమ దళాలను బెలారస్‌ సరిహద్దులకు తరలించింది.

Tags

Next Story