RICE BAN: ప్రపంచవ్యాప్తంగా పెరిగిన బియ్యం ధరలు

RICE BAN: ప్రపంచవ్యాప్తంగా పెరిగిన బియ్యం ధరలు
బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధంతో పెరిగిన ధరలు... సుమారు 10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బియ్యం కొరత

బాస్మతీయేతర బియ్యం( non-basmati white rice) ఎగుమతులపై భారత్‌(india) విధించిన నిషేధం(bans export of non-basmati white rice) ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న ఇండియా... బియ్యంపై నిషేధం విధించడంతో ప్రపంచంలోని అనేక నగరాల్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భారత్‌ నిషేధంతో ప్రపంచంలో సుమారు 9.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం కొరత ఏర్పడింది. ఎల్‌ నినో వంటి వాతావరణ పరిస్థితులు కూడా బియ్యం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచ విపణిలో బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వియత్నాం నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ధరలు గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.


ఈ పరిణామాలు పేద దేశాల ప్రజలు గడ్డు కాలం ఎదుర్కొనేలా చేశాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా భారత్‌ విధానాన్ని అనుసరిస్తోంది.తమ దేశీయ నిల్వలను కాపాడుకునేందుకు బియ్యం ఎగుమతులను UAE నిలిపివేసింది. అస్థిర వాతావరణం, ఎల్ నినో వంటి పరిస్థితులు భారత్‌ను బియ్యం ఎగుమతిపై(Rice exporters) ఆంక్షలు విధించేలా చేసింది. దేశీయంగా ఆహార ధరలు పెరగకుండా నిరోధించేందుకు పాక్షిక నిషేధం అవసరమని భారత నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌ తీసుకున్న నిషేధ నిర్ణయం బియ్యం పండించే ఇతర దేశాలకు లాభదాయకంగా మారింది. థాయ్‌లాండ్‌ ప్రభుత్వం గతేడాది కంటే ఎక్కువ బియ్యాన్ని ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 2022లో ఎగుమతి చేసిన దానికంటే ఈ ఏడాది మొదటి 6నెలల్లోనే థాయ్‌లాండ్‌ 15 శాతం ఎక్కువ బియ్యం ఎగుమతి చేసింది.

అంతర్జాతీయంగా వరి పండిండే అనేక దేశాల్లో వివిధ కారణాల వల్ల దిగుబడి తగ్గుతోంది. ముఖ్యంగా మన బియ్యాన్ని వియత్నాం భారీగా దిగుమతి చేసుకుంది. ఇతర దేశాలు కూడా బియ్యం దిగుమతికి ప్రాధాన్యం ఇవ్వడంతో.. భారత ప్రభుత్వం ముందు జాగ్రత్తగా బాస్మతియేతర బియ్యంపై నిషేధం విధించింది. మరోవైపు ఎగమతులపై నిషేధం లేకున్నా... బాస్మతీ బియ్యానికి కూడా డిమాండ్‌ పెరిగింది. గల్ఫ్‌ దేశాల్లో బాస్మతీకి డిమాండ్‌ పెరుగుతోంది.

భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో పాక్‌(pak) బియ్యానికి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. యూరప్‌(europe) సహా చాలా దేశాలు పాక్‌ బియ్యం ఎగుమతి కోసం(Rice exporters of Pakistan) ఆర్డర్లు ఇస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, ఐరోపా దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు పాకిస్థాన్‌ ఎగుమతిదారులు చెబుతున్నారు. 5మిలియన్‌ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు రష్యా కూడా ఆసక్తి చూపుతున్నట్లు పాకిస్థాన్‌ బియ్యం ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి తెలిపారు.How India’s ban on some rice exports is ricocheting around the world

Tags

Read MoreRead Less
Next Story