Illegal immigrants: భారత్ నుంచి అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. హక్కుల సంస్థ ఆరోపణలు..

Illegal immigrants: భారత్  నుంచి అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. హక్కుల సంస్థ ఆరోపణలు..
X
భారత్ ముస్లింలను బహిష్కరిస్తోందని నివేదిక..

అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని భారతదేశం గుర్తించి, వారిని సొంత దేశానికి పంపిస్తోంది. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు దేశంలోకి చొరబడుతున్నారు. వీరందరిపై భారత్ ఇప్పుడు పోరాడుతోంది. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వీరిని గుర్తించి సొంతదేశానికి తిప్పిపంపిస్తున్నారు. అయితే, ఇప్పుడు అంతర్జాతీయ హక్కుల సంస్థకు మాత్రం వీరిపై తెగ జాలి చూపిస్తోంది. భారత్ తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తోంది.

భారతదేశం ‘‘వందల మంది ముస్లింలను చట్టవిరుద్ధంగా బహిష్కరిస్తోంది’’ అని న్యూయార్క్‌కు చెందిన అంతర్జాతీయ ఎన్జీవో హ్యుమన్ రైట్స్ వాచ్(HRW) ఆరోపించింది. పత్రాలు లేని వలసదారులపై భారత్ తీసుకుంటున్న చర్యలు మతపరమైన పక్షపాతంతో జరుగుతున్నాయని ఆరోపించింది. బంగ్లాదేశ్‌కు బహిష్కరించిన వారిలో భారతీయులు, ముఖ్యంగా ముస్లింలు ఉన్నారని చెప్పింది. భారతదేశానికి సార్వభౌమ దేశంగా అక్రమ వలసదారుల్ని బహిష్కరించే హక్కు ఉందని, భారత చట్టం ప్రకారం, విదేశీయులుగా తేలిన రోహింగ్యాలను బహిష్కరించాలని సుప్రీంకోర్టు మేలో తీర్పు ఇచ్చింది. మే 2025 నుండి, ప్రభుత్వం వందలాది మంది జాతి బెంగాలీ మాట్లాడే ముస్లింలను “అక్రమ వలసదారులు” అని పేర్కొంటూ బంగ్లాదేశ్‌కు బహిష్కరించడానికి కార్యకలాపాలను ముమ్మరం చేసిందని HRW నివేదిక ఆరోపించింది.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారితో దేశంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీరు ఉగ్రవాదం, నేరాల్లో పాలుపంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని అధికారులు గుర్తించి, వారి దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ , జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని చాలా జిల్లాలు అక్రమ వలసలకు కేంద్రంగా మారాయని పలువురు నాయకులు, నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ వలసలు భౌగోళిక, మతపరమైన మార్పులకు కారణమైంది, ఈ దేశ ప్రజలపై జులుం చెలాయిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) 2016 డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 20 మిలియన్ల అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు నివసిస్తున్నారు. కొందరు అక్రమంగా భారత గుర్తింపును సంపాదించి, ఈ దేశ ఎన్నికల్లో పాల్గొనడం, పోటీ చేయడం చేస్తుండటం ఆందోళనకరంగా మారింది.


Tags

Next Story