Hurricane Milton: ముంచుకొస్తున్న మిల్ట‌న్‌ హ‌రికేన్

Hurricane Milton:  ముంచుకొస్తున్న మిల్ట‌న్‌ హ‌రికేన్
X
ఫ్లోరిడాలో ఎమ‌ర్జెన్సీ

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వైపు హ‌రికేన్ మిల్ట‌న్దూ సుకొస్తున్న‌ది. మిల్ట‌న్ హ‌రికేన్ తీవ్ర తుఫాన్‌గా మార‌నున్న‌ది. దీంతో అనేక ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. అధిక జ‌నాభా క‌లిగిన టంపా బేలో హ‌రికేన్ మిల్ట‌న్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం అయిదో కేట‌గిరీ తుఫాన్‌గా మిల్ట‌న్ హ‌రికేన్‌ను ప్ర‌క‌టించారు. మిల్ట‌న్ వ‌ల్ల గంట‌కు సుమారు 165 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. బుధ‌వారం రాత్రి అత్యంత శ‌క్తివంతంగా ఆ గాలులు తీరాన్ని చేరే అవ‌కాశాలు ఉన్నాయి. రెండు వారాల క్రిత‌మే హెలీన్ హ‌రికేన్ .. ఫ్లోరిడాలో తీవ్ర బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఫ్లోరిడాలోని లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్ర‌దేశాల‌కు చేరుకోవాల‌ని అధ్య‌క్షుడు బైడెన్ కోరారు. ఇది జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారే అవ‌కాశాలు ఉన్నట్లు చెప్పారు. అయిదో కేట‌గిరీ హెచ్చ‌రిక అంటే, ఆ తుఫాన్ ఓ టోర్న‌డోలా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. ఫ్లోరిడాలో డ‌జ‌న్ల సంఖ్య‌లో షెల్ట‌ర్ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రాన్ డీసాంటిస్ తెలిపారు. ఇప్ప‌టికే పెట్రోల్ స్టేష‌న్ల‌లో భారీ క్యూలైన్ల‌ను ఏర్పాటు చేశారు. కొన్ని స్టేష‌న్ల‌లో ఇంధ‌నం దొర‌క‌డం లేదు. స్టేష‌న్ల‌కు పెట్రోల్ పంపిస్తున్నామ‌ని, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

మిల్ట‌న్ హ‌రికేన్ నేప‌థ్యంలో.. దేశాధ్య‌క్షుడు బైడెన్ విదేశీ టూర్‌ను ర‌ద్దు చేసుకున్నారు. జ‌ర్మ‌నీతో పాటు అంగోలాలో ఆయ‌న ప‌ర్య‌టించాల్సి ఉన్న‌ది. కానీ పున‌రావాస ప‌నులు ప‌ర్య‌వేక్షించేందుకు ఆయ‌న స్వ‌దేశంలోనే ఉండిపోనున్నారు. ఫ్లోరిడాలో టూరిస్టు కేంద్రాలైన డిస్నీ ల్యాండ్‌, కెన్న‌డీ స్పేస్ సెంట‌ర్ల‌ను మూసివేశారు.

Tags

Next Story