Hyderabad: U.S.కు ఎగిరిపోవడంలో మనోళ్లే తోపు..

కారణమేదైనా అమెరికాకు వెళ్లేవారిలో హైదరాబాదీలే ముందువరుసలో ఉన్నారని స్పష్టమైంది. ఓపెన్ డోర్స్ రిపోర్ట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇతర నగరాలకన్నా హైదరాబాద్ నుంచే అమెరికాకు ఎక్కువ మంది వలస వెళుతున్నారని తెలుస్తోంది.
2020-21లో 1,67,582 మంది విద్యార్థులు వెళ్లగా 2021-22 సంవత్సరంలో 1,99,182 మంది వెళ్లని ఓపెన్ డోర్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. భారత విద్యార్థులను ఎక్కువగా అమెరికాకు పంపుతున్న నగరాలలో ఢిల్లీ, ముంబైను దాటి హైదరాబాద్ ముందు వరసలో ఉంది.
2021/22 సంవత్సరంలో 2.61 లక్షల మంది విద్యార్థులు USయూనివర్సిటీలకు అప్లై చేయగా అందులో 75000 మంది భారత్‌కు చెందిన వారేనని ఓపెన్ డోర్స్ రిపోర్ట్ పేర్కొంది. 75000 మంది భారత విద్యార్థులలో 30 శాతం హైదరాబాద్‌కు చెందినవారే కావడం గమనార్హం.
కోవిడ్ కారణంగా USకు వెళ్లేందుకు చైనా విద్యార్థులకు వీసాలు పొందటం కష్టతరం కావడంతో చైనా భారత్ కంటే వెనకబడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com