Hamas-Israel: మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఉగ్రవాదుల ఉనికి చెప్పండి

గాజా ప్రజలకు ఇజ్రాయెల్ ఓ ఆఫర్ ప్రకటించింది. తమ దేశ పౌరులను హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాచారో సమాచారం ఇస్తే డబ్బు ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా సమాచారం ఇచ్చినవారికి రక్షణ కల్పించడంతోపాటు వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని భావించినవారు, శాంతియుతంగా బతకాలని కోరుకున్నవారు ఈ పని చేయాలని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. సమాచారం ఇచ్చినవారి ప్రాంతంలో మానవతాసాయం అందేలా చూస్తామని తెలిపింది. సమచారం ఇవ్వాల్సిన వాట్సాప్ , టెలిగ్రామ్ , ఫోన్ నంబర్లను విడుదల చేసింది. కాగా ప్రస్తుతం 220 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు సమాచారం. అటు.. గాజాలో దాడులతో పూర్తిగా సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వారు సమాచారం ఇస్తారో తెలీకుండా పోయింది.
మరోవైపు హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల సంఖ్యను ఆ దేశం మరోసారి సవరించింది. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలుగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇదే తుది సంఖ్య కాదని చెప్పడం గమనార్హం. దీనిని బట్టి భవిష్యత్‌లోనూ బందీల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు 75 ఏళ్ల దేశచరిత్రలో హమాస్ దాడిలో తమ దేశానికి చెందిన 1,400 మంది పౌరులు చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు గత 24 గంటల వ్యవధిలో హమాస్‌పై 300కు పైగా నూతన దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ సోమవారం వెల్లడించింది. దీంతో గాజాలో మరణాల సంఖ్య 5,000కు పెరిగింది అని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే మరణించిన వారిలో 2,000 మంది పిల్లలున్నట్టు పేర్కొంది.
హమాస్ తన సాయుధ ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న శిశువులు, పిల్లలను చూపించే విజువల్స్‌ను విడుదల చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు కూడా షేర్ చేసిన ఫుటేజ్‌లలో ఇది ఒకటి. ఇజ్రాయెల్ భూ దండయాత్ర సమయంలో హమాస్ పిల్లలను కవచాలుగా వాడుకోవచ్చనే వాదనను నిర్ధారించేలా ఈ విజువల్స్ ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com