IMF Warns : ప్రపంచ దేశాలకు ఆర్థిక మాంద్యం ముప్పు: ఐఎమ్ఎఫ్ హెచ్చరిక

IMF Warns : ప్రపంచ దేశాలకు ఆర్థిక మాంద్యం ముప్పు: ఐఎమ్ఎఫ్ హెచ్చరిక
IMF Warns : ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా కుప్పకూల్చడంతో ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు పెద్ద ఎత్తున ప్యాకేజీలను ప్రకటించాయి.

IMF Warns : ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా కుప్పకూల్చడంతో ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు పెద్ద ఎత్తున ప్యాకేజీలను ప్రకటించాయి. దీని నుంచి బయటపడి ఊపిరి తీసుకుంటున్న సమయాన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రెండు పరిణామాల వలన ఆహార ధాన్యాలు, చమురు ధరలు పెరిగి అన్ని దేశాలలో ద్రవ్యోల్బణం విజృంభించింది. దీంతో ప్రజల ఆదాయం పడిపోయి ప్రపంచవ్యాప్తంగా వృద్ధి మందగించిందని వేరు వేరు నివేదికలు చెబుతున్నాయి.


మరోవైపు ప్రపంచ ఆర్థిక మాంద్యం ముప్పు రోజు రోజుకీ పెరుగుతోంది. ఇంటర్నేషనల్‌ మానటరీ ఫండ్‌ కూడా ఇదే చెప్పింది.. ప్రపంచ దేశాలకు పెద్ద ఆర్థిక మాంద్యం పొంచి ఉందని IMF హెచ్చరించారు. ఈ మాంద్యంతో ప్రపంచ దేశాల జీడీపీ 2026 నాటికి దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేరకు తరిగిపోతుందని, ఆర్ధిక మాంద్యానికి దారితీసే రిస్క్‌ ఎక్కువవుతుందని IMF అధికారులు హెచ్చరిస్తున్నారు. 2022 లేదా 2023 సంవత్సరంలో ప్రపంచ జీడీపీలో మూడో వంతు వాటా ఉన్న దేశాల జీడీపీ రెండు త్రైమాసికాలు మైనస్‌ స్థాయికి పడిపోతుందని IMF ఎండీ జార్జీవా క్లారిటీ ఇచ్చారు.


ఇక ఈ ఆర్థిక మాంద్యం తీవ్రత పెరిగి 2023 నాటికి అన్ని దేశాలను చుట్టుముట్టనుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు వచ్చే మాంద్యం సామాన్యమైనది కాదని దీని తీవ్రత దీర్ఘకాలం ఉండబోతోందని, ఈ ఏడాది చివరిలోగా అమెరికాలో ప్రారంభమవుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఆర్థిక మాంద్యం కంటే ముందు శరవేగంగా పడిపోతున్న ప్రస్తుత వృద్ధి రేటు మున్ముందు ఇలాగే కొనసాగితే ప్రపంచంలోనే అత్యధిక దేశాలు మాంద్యంలో కూరుకుపోయి వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోవడం ఖాయమనే హెచ్చరికలు వస్తున్నాయి. భారత్‌లో మాత్రం ఈ మాంద్యం ప్రభావం పెద్దగా ఉండబోదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనికి కారణం 2008‌లో భారత్‌ ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురయ్యింది.


మరోవైపు ఈ సంవత్సరం ప్రపంచ జీడీపీ వృద్ధిరేటును కూడా IMF 3.2 శాతానికి కుదించేసింది. వచ్చే ఏడాది ఇది మరింత తగ్గి 2.9 శాతం మించక పోవచ్చునని . ప్రపంచ జీడీపీ అంచనాలను IMF కుదించడం ఈ ఏడాది వరుసగా ఇది నాలుగోసారి. నవంబరు నుంచి రోజువారీ చమురు ఉత్పత్తి 20 లక్షల పీపాలు తగ్గిస్తున్నట్టు ఒపెక్‌ దేశాలు ప్రకటించి 24 గంటలు గడవకముందే IMF ఎండీ ఆర్థిక మాంద్యం హెచ్చరిక చేశారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతోనే ఈ ఆర్థిక మాంద్యం ముప్పు ఏర్పడిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


అయితే నేడు ఆ రంగానికి మాంద్యాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మన దేశానికి ఉందా? అనేది ప్రధాన ప్రశ్న. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న గణాంకాలను సంఘటిత రంగానివే కానీ దేశంలో అసంఘటిత రంగం పరిస్థితి నానాటికీ క్షీణిస్తుంది. జీఎస్టీ వలన కొనుగోలు శక్తి క్షీణీంచలేదు అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మాంద్యం వేళ ప్రజలపై పన్నుల భారం తగ్గించగలుగుతేనే మాంద్యం ప్రభావం నుండి మనం బయటపడినట్టు.దీనికి ప్రభుత్వ వ్యయం పెరగాలి, సరఫరాలు పెంచాలి ,ఉత్పత్తి పెంచాలి ,పేద ప్రజలలో కొనుగోలు శక్తి పెంచాలి.కానీ ఇవేవీ చేయకుండానే ప్రతికూలతలు గుర్తించి కట్టడి చేయకపోతే ఆర్థిక వేత్తలు చెబుతున్నట్టు మన దేశాన్ని మాంద్యం చుట్టుముట్టడం ఖాయం.

Tags

Read MoreRead Less
Next Story