Pakistan: భారత్‌తో యుద్ధానికే అసిమ్ మునీర్ తహ తహ ఇమ్రాన్ సోదరి

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధానికి తహతహలాడుతున్నారని జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులలో ఒకరైన అలీమా ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారనే పుకార్ల నేపథ్యంలో, మంగళవారం అతడి సోదరిని ప్రభుత్వం కలిసేందుకు అనుమతి ఇచ్చింది. దీని తర్వాత, ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
మే నెలలో జరిగిన భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణ గురించి ప్రశ్నించిన సమయంలో..”అసిమ్ మునీర్ ఒక రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్, ఇస్లామిక్ కన్జర్వేటివ్. అతను భారతదేశంతో యుద్ధం కోసం తహతహలాడటానికి ఇదే కారణం. అతని ఇస్లామిక్ రాడికలైజేషన్ మరియు సంప్రదాయవాదం ఇస్లాంను నమ్మని వారిపై పోరాడటానికి అతన్ని బలవంతం చేస్తున్నాయి” అని అలీమా అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడిపించేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆమె కోరారు.
‘‘ఇమ్రాన్ ఖాన్ స్వచ్ఛమైన ఉదారవాది అని, ఇమ్రాన్ అధికారంలో వచ్చినప్పుడల్లా, అతను భారత్‌తో, బీజేపీతో కూడా స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారని మీరు భావిస్తున్నారు. ఈ రాడికల్ ఇస్లామిస్ట్ అసిమ్ మునీర్ ఉన్నప్పడల్లా భారత్, దాని మిత్ర దేశాలతో యుద్ధం జరగడం మీరు చూస్తారు. ఇమ్రాన్ ఒక ఆస్తి.’’ అని ఆమె అన్నారు.
అంతకుముందు, ఇమ్రాన్ మరో సోదరి ఉజ్మా ఖానుమ్ ఆయనను రావల్పిండిలోని అడియాలా జైలులో కలుసుకున్నారు. ‘‘అసిమ్ మునీర్ చరిత్రలో అత్యంత నిరంకుశ నియంత. అతను మానసికంగా అస్థిరంగా ఉన్నాడు. ఇప్పుడు వారికి మిగిలింది నన్ను హత్య చే యడమే’’ అని ఇమ్రాన్ తనతో అన్నారని అతడి మరో సోదరి ఉజ్మా చెప్పారు. తనను, తన భార్యను తప్పుడు కేసులో ఇరికించారని, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరణశిక్ష విధించబడిని వ్యక్తి ఉన్న సౌకర్యాలే తనకు ఉన్నాయని, జంతువుల కన్నా దారుణంగా చూశారని ఆయన చెప్పినట్లు అతడి సోదరి వెల్లడించింది. మునీర్ విధానాలు పాకిస్తాన్‌కు వినాశకరమైనవని, దేశంలో ఉగ్రవాదం క్యాన్సర్ లా అదుపు తప్పిందని విచారం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

