Pakistan: అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్యకు ముందస్తు బెయిల్

Pakistan: అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్యకు ముందస్తు బెయిల్
X
అల్ ఖదీర్ యూనివర్శిటీకి సంబంధించిన కేసులో మంజూరు

అవినీతి కేసులో జైలు శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య బుష్రా బీబీకి పాకిస్థాన్‌లోని అవినీతి నిరోధక కోర్టు మంగళవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో జాతీయ ఖజానాకు సుమారు రూ. 50 బిలియన్ల నష్టం కలిగించారనే ఆరోపణలను ఖాన్, అతని భార్యతో పాటు ఇతర నిందితులు ఎదుర్కొంటున్నారు. విశ్వవిద్యాలయం కోసం భూమిని సేకరించినందుకు బదులుగా ఒక బిలియనీర్ వ్యాపారవేత్తకు ఆర్థిక సహాయం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అక్రమాస్తుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు బెయిల్ లభించింది. అల్ ఖదీర్ యూనివర్శిటీకి ఆర్థిక సహాయానికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి రావల్పిండి అకౌంటబిలిటీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్రమాస్తులపై ఇద్దరూ ఆరోపణలను ఖండించారు. ఈ కేసులో అల్ ఖాదిర్ యూనివర్సిటీని స్థాపించడానికి ల్యాండ్ డెవలపర్ నుంచి ఆర్థిక సహాయం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుష్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు. ఖాన్‌తో వివాహం చట్టవిరుద్ధమని నిర్ధారించిన కేసులో ఆమె జైలులోనే ఉంటుంది.

ఫిబ్రవరి సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్తాన్ మాజీ ప్రధాని కొన్ని కేసుల్లో దోషిగా నిర్ధారించబడ్డారు. అయితే UN మానవ హక్కుల కార్యవర్గం సోమవారం ఆయన ఏకపక్ష జైలు శిక్ష అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. ఇక ఇటీవల కాలంలో ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలపై అతని శిక్షను రద్దు చేస్తూ ప్రభుత్వ బహుమతులను అక్రమంగా సంపాదించడం మరియు విక్రయించడంపై రెండు కేసులకు సంబంధించి పాకిస్తాన్ కోర్టులు ఖాన్ జైలు శిక్షలను నిలిపివేసాయి.

Tags

Next Story