omicron variant : అమెరికాను అల్లాడిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

omicron variant : అమెరికాను అల్లాడిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌
omicron variant : చైనాలో వెలుగుచూసిన కరోనా.. కొత్త పుంతలు తొక్కుతూ కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది.

omicron variant : చైనాలో వెలుగుచూసిన కరోనా.. కొత్త పుంతలు తొక్కుతూ కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒక్కరోజులోనే ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన పరుస్తోంది. కరోనా మహమ్మారి వెలుగుచూసిన దగ్గరి నుంచి ఈ స్థాయిలో కేసులు ఎప్పుడూ రాలేదు. ఇందులో 65 శాతం కేసులు అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా నుంచే వస్తున్నాయి.

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ అమెరికాను అల్లాడిస్తోంది. అమెరికాలో కొత్తగా 5 లక్షల 67వేల 696 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇందులో 95 శాతం ఒమిక్రాన్‌ కేసులుగా గుర్తించారు. అంతకుముందు రోజు పది లక్షల కేసులు నమోదయితే అవి దాదాపు సగానికి పడిపోవడం ఊరటనిచ్చే అంశం. లక్షల్లో కేసులు వస్తుండడంతో ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు వైట్‌ హౌజ్‌ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన పరుస్తోంది.

అమెరికాతో పాటు యూరప్‌ను కరోనా థర్డ్‌ వేవ్‌ బెంబేలెత్తిస్తోంది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీల్లో లక్షల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కొత్త వేరియంట్‌ గుర్తింపబడ్డ ఫ్రాన్స్‌లో 3 లక్షల 32వేల 252 కేసులు వచ్చాయి. బ్రిటన్‌ను వెనక్కి నెట్టి అమెరికా తర్వాతి స్థానంలో ఫ్రాన్స్‌ నిలిచింది. గతం రోజు కంటే రెట్టింపు స్థాయిలో కోవిడ్‌ కేసులు వచ్చాయి. బ్రిటన్‌లోనూ కోవిడ్‌ కల్లోలం ఆగడం లేదు. అక్కడ వరుసగా మూడో రోజు దాదాపు రెండు లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇటలీలోనూ కోవిడ్‌ విజృంభిస్తోంది. అక్కడ లక్షా 89వేల 109 కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా, టర్కీల్లో 60వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు గతంలో కంటే భారీగా వెలుగుచూస్తున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా నమోదవడం ఊరటనిస్తోంది. కరోనా థర్డ్‌ వేవ్‌తో పలు దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story