భారత్-పాక్ వివాదం.. అమెరికా జోక్యం చేసుకోదు: జేడీ వాన్స్

జమ్మూ, పఠాన్‌కోట్ అనేక ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ విఫల ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య వివాదం "ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు" అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలు ఉద్రిక్తతను తగ్గించుకోవాలని చెబుతున్నారు.
"మనం చేయగలిగేది ఏమిటంటే, ఇరు వర్గాలను ఉద్రిక్తతలను తగ్గించుకోమని కోరుతున్నాము. కానీ మేము యుద్ధం మధ్యలో జోక్యం చేసుకోము. అది ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు. దానిని నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నించదు అని అన్నారు. అటు పాకిస్తాన్ కు కానీ, ఇటు భారతీయులకు కానీ ఆయుధాలు వదులుకోమని చెప్పలేము. కాబట్టి, మేము దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని కొనసాగిస్తాము," అని అంతర్జాతీయ సంఘర్షణల నుండి అమెరికా వైదొలగాలని సమర్థించిన వాన్స్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
"ఇది విస్తృత యుద్ధంగా లేదా అణు సంఘర్షణగా మారకూడదని మా ఆశ " అని వాన్స్ జోడించారు."ప్రస్తుతానికి, అది జరుగుతుందని మేము అనుకోవట్లేదు." అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం, పాకిస్తాన్‌లు "టిట్ ఫర్ టాట్" చర్యలను "ఆపాలని" కోరుకుంటున్నానని చెప్పారు.
"ఇద్దరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ యుద్దం మరింత తీవ్రం కాకూడదని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. బుధవారం భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) మరియు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు చేసిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం ఫిరంగి, మోర్టార్ దాడులకు పాల్పడింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) మరియు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com