భారత్‌ను కట్టడి చేసేందుకు చైనా వ్యూహాలు

భారత్‌ను కట్టడి చేసేందుకు చైనా అనేక వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో అక్రమంగా చొరబడి అరాచకాలు సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లద్దాఖ్ వద్ద భారత్‌ను ఇబ్బంది పెడుతున్న డ్రాగన్ కంట్రీ.... ఇప్పుడు మరింత వేధింపులకు గురిచేసేందుకు పాక్ ఉగ్రవాదాన్ని సాధనంగా వాడాలనే దురాలోచనతో ఉందంటున్నారు అమెరికా పబ్లిక్ పాలసీ రిసెర్చర్ మైఖల్ రూబిన్. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ - FATF కొరడా ఝుళిపిస్తోంది. అయినా అంతర్జాతీయ సమాజానికి జవాబుదారీ వహించే పరిస్థితి నుంచి చైనా తనను రక్షిస్తుందని పాక్ భావిస్తోందని తెలిపారాయన. అయితే ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్ గ్రే లిస్ట్ లేక బ్లాక్ లిస్ట్‌లో ఉంటుందా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్న తరుణంలో ఇది బయటికి వచ్చింది.
ఇప్పటి వరకు బ్లాక్ లిస్ట్‌లో ఇరాన్, ఉత్తరకొరియా మాత్రమే ఉన్నాయి. ఆ జాబితాలోకి చేరకుండా ఉండేందుకు పాక్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ కళ్లు కప్పేందుకు ఉగ్రవాద కట్టడికి చర్యలు తీసుకున్నట్టు నటిస్తోంది పాక్ ప్రభుత్వం. అయితే ఉగ్రవాదాన్ని నిరోధించే విషయంలో బీజింగ్ నిబద్ధత చూపడం లేదు. ఇక ... ఇటీవల పాక్ ఆర్థిక సలహాదారు అబ్దుల్ హఫీజ్ షేక్, చైనా రాయబారి యావో జింగ్ మధ్య జరిగిన సమావేశం గురించి మైఖల్ రూబిన్ ప్రస్తావించారు. వీరిద్దరూ ఎఫ్‌ఏటీఎఫ్ కట్టుబాట్ల గురించి చాలా తక్కువగా మాట్లాడినట్లు తెలిపారు. 60 బిలియన్ డాలర్ల విలువైన చైనా, పాకిస్థాన్ ఆర్థిక నడవా గురించి ఎక్కువగా చర్చించినట్లు తెలిపారు.
పాకిస్థాన్ ఆర్థిక పరపతి, ఎఫ్ఏటీఎఫ్ జవాబుదారీ నుంచి ఆ దేశం బయటపడటంపైనే ఆర్థిక నడవా విజయం ఆధారపడి ఉంటుందని అంచనా వేశారు. కాగా, పాక్ ఎఫ్ఏటీఎఫ్ హోదాపై శనివారం చైనా వేసే ఓటు ఆ దేశ వైఖరిని వెల్లడి చేస్తుందన్నారు. దానికి సంబంధించిన మూడు రోజుల ప్లీనరీ సమావేశం శనివారంతో ముగుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com