చందమామపై కాలుమోపనున్న మన చారి

చందమామపై మరోసారి కాలు మోపేందుకు సన్నద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తికి స్థానం లభించింది. చంద్రయాన కార్యక్రమం ఆర్టిమిస్‌లో పాల్గొనేందుకు 43 ఏళ్ల రాజా జాన్ వుర్సుత్తూర్ చారి శిక్షణ పొందుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగం పంచుకోవడం తనకు గర్వకారణమని రాజా చారి ఈ సందర్భంగా ప్రకటించారు. తనను ఇంతవాడిని చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా చారి ప్రముఖ మస్సాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం 2017లో నాసాలో చేరిన చారికి.. చారిత్రక అమెరికా మూన్ మిషన్‌లో భాగమయ్యే అవకాశం దక్కింది. తమ బృందం అనేక ప్రత్యేకతలతో కూడినదని నాసా వివరించింది. ఈ బృందంలో మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 18 మంది పాల్గొననున్న ఈ యాత్రలో సగం మంది మహిళలు కావడం విశేషం. వైవిధ్యభరితమైన తమ ఆర్టిమిస్ బృందం వివిధ రంగాలు, నైపుణ్యం, అనుభవం, సామాజిక స్థితులు, నేపధ్యాలతో కూడి ఉందని తెలిపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com