Shubhanshu Shukla: అంతరిక్ష యాత్ర తర్వాత.. కుటుంబసభ్యులను కలిసి శుభాన్షు శుక్లా

Shubhanshu Shukla: అంతరిక్ష యాత్ర తర్వాత..  కుటుంబసభ్యులను కలిసి శుభాన్షు శుక్లా
X
ఫొటోలు వైరల్‌

భారత రోదసి చరిత్రలో తనపేరు లిఖించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఆనందంతో హత్తుకున్నారు. దీనికి సంబంధించి శుభాంశు ఇన్‌స్టాలో ఫొటోలను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. రెండు నెలల తర్వాత తన కుటుంబాన్ని కలవడంతో శుభాంశ్‌ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.

‘‘అంతరిక్షయానం అద్భుతం. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడం సైతం అంతే అద్భుతం. ఈ ప్రయాణం కోసం రెండు నెలలు క్వారంటైన్‌లో గడిపాను. ఈ సమయంలో దూరం నుంచి నా కుటుంబాన్ని చూడాల్సి వచ్చింది. భూమికి తిరిగివచ్చి ఫ్యామిలినీ హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోంది. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం. మన జీవితాల్లోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటాము. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వారిని కలిశాను. అంతరిక్ష ప్రయాణాలు మాయాజాలంగా అనిపిస్తాయి. అయితే మనుషుల వల్లే అవి అలా మారాయి’ అని శుభాంశు పోస్టు చేశారు. ”అంతరిక్షయానం అద్భుతంగా ఉంటుంది. కానీ చాలా కాలం తర్వాత మీ ప్రియమైన వారిని చూడటం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. నేను క్వారంటైన్‌లోకి వెళ్లి 2 నెలలు అయింది. క్వారంటైన్ కుటుంబ సందర్శనల సమయంలో మేము 8 మీటర్ల దూరంలో ఉండాల్సి వచ్చింది. నా చిన్నారి చేతుల్లో క్రిములు ఉన్నాయని చెప్పాల్సి వచ్చింది. అందుకే అతను నన్ను తాకలేకపోయాడు. అతను సందర్శనకు వచ్చిన ప్రతిసారీ తన అమ్మను “నేను నా చేతులు కడుక్కోవచ్చా?” అని అడిగేవాడు. అది సవాల్ తో కూడుకున్నది. భూమికి తిరిగి వచ్చి నా కుటుంబాన్ని నా చేతుల్లో పట్టుకోవడం అద్భుతంలా అనిపించింది” అని తన అనుభవాన్ని పంచుకున్నారు శుభాంశు శుక్లా.

‘‘శుభాంశు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ అద్భుత ప్రయాణం తర్వాత తను తిరిగి మమ్మల్ని కలవడమే మాకు అతిపెద్ద సెలబ్రేషన్‌. ఇకపై తను మునుపటి జీవితాన్ని కొనసాగించడంపైనే తాము దృష్టి నిలుపుతాము. అంతరిక్షంలో ఉన్న సమయంలో తను ఇంటి ఆహారాన్ని మిస్‌ కావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన ఆహారాన్ని వండేందుకు ఇప్పటికే ప్లాన్‌ చేసుకుంటున్నా’’ అని కమ్నా పేర్కొన్నారు.

Tags

Next Story