USA: సాయిదత్త పీఠం ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు

అమెరికాలో ఎన్‌ఆర్‌లు భారత స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లోని ఓక్ ట్రీ రోడ్‌లో ఉన్న సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయ ఆవరణలో శ్రీ రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు ఎడిసన్ మేయర్ సామ్ జోషి. కార్యక్రమంలో కౌన్సిల్ మాన్ అజయ్ పాటిల్, కమిషనర్ ఉపేంద్ర చివుకుల, రోజా శంకరమంచితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఎన్‌ఆర్‌ఐలు మువ్వన్నెల జెండా చేతబట్టి వందేమాతరం, భారతమాత కీ జై అంటూ నినాదాలు చేశారు.
అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఎడిసన్. ప్రవాసులు భారతదేశం గర్వపడే పనులు చేపట్టాలని కోరారు మేయర్ సామ్ జోషి. భారతమాత బానిస సంకెళ్లను తొలగించుకుని స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న శుభదినాన్ని.. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా దేవాలయ ప్రాంగణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ శ్రీ రఘుశర్మ శంకరమంచి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com