
పిల్లలపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి అమెరికాలో ఒక భారతీయుడుని అరెస్ట్ చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లి అనే ఈ నిందితుడు సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించాడని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. నిందితుడిని న్యూజెర్సీలో అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు.
13 సంవత్సరాల లోపు మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అతడిని దేశం నుంచి బహిష్కరించేందుకు న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

