Hong Kong: మహిళపై లైంగిక వేధింపులు..భారతీయుడు అరెస్ట్
హాంగ్‌కాంగ్‌లో ఒక భారతీయుడని పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఒక మహిళపై ఆ వ్యక్తి లైంగికవేధింపులకు పాల్పడ్డాడు. ఆమె చేయి పట్టుకుని రమ్మంటు అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యంగా తాకుతూ రెచ్చిపోయాడు. అందంతా ప్రత్యక్ష ప్రసారంలో చేస్తున్న కెమెరాలో రికార్డు అయ్యింది. ఆమె దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, అది వైరల్ కావటంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు ప్రబుద్ధుడిని అరెస్ట్ చేశారు.
దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి హాంకాంగ్‌లో పర్యటిస్తూ, తన పర్యటన వివరాలను కెమెరాలో బంధిస్తోంది. అంతలోనే ఓ వ్యక్తి ఆమెను ఏదో అడ్రస్ గురించి అడిగి మాట కలిపాడు. తరువాత ఆమెను వెంబడిస్తూ తాను ఒక్కడినే ఉన్నానని, తనతో రమ్మని అని వేధించాడు. ఆమెను తాకేందుకు యత్నించాడు. దీంతో ఆమె చికాకుకు గురైంది. నో.. నో.. అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తింది. మెట్రో స్టేషన్ వద్ద మెట్లు ఎక్కుతుండగా, ఆమెను గొడకు నొక్కి బంధించాడు. నేను ఒక్కడినే ఉన్నాను.. నాతో రా అని డిమాండ్ చేశాడు. నేను ఒంటరిగా లేను అంటూ అతడిని ఆమె తోసేసింది. మహిళను గట్టిగా కౌగిలించుకొని, బలవంతంగా కిస్ ఇచ్చాడు. తరువాత అక్కడ్నుంచి అతను పరారీ అయ్యాడు. ఆమె తీవ్ర అసౌకర్యానికి గురి అయినట్లుగా ప్రత్యక్షంగా వీడియోలో కనిపించింది.
వ్లాగర్ అయిన మహిళ కెమెరాలో రికార్డు అయిన ఇదంతా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, అది వైరల్ కావటంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు ప్రబుద్ధుడిని అరెస్ట్ చేశారు. అతను వెయిటర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com