Ukraine: భారత వైద్య విద్యార్థులపై ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం.. భవిష్యత్ ప్రశ్నార్థకం

Ukraine: భారత వైద్య విద్యార్థులపై ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం.. భవిష్యత్ ప్రశ్నార్థకం
Ukraine: తిరిగి వచ్చేదేలే అంటున్నారు ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌. యుద్ధం నేపధ్యంలో గతంలో భారత్‌కు తిరిగివచ్చారు 1500 మంది స్టూడెంట్స్.

Ukraine: తిరిగి వచ్చేదెలే అంటున్నారు ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌. యుద్ధం నేపధ్యంలో గతంలో భారత్‌కు తిరిగివచ్చారు 1500 మంది స్టూడెంట్స్. అయితే పరిస్థితి సర్దుమణగడంతో తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిపోయారు..

ఉక్రెయిన్‌ స్టూడెంట్స్‌కు ఇండియన్‌ మెడికల్‌ కాలేజ్‌లలో...ప్రవేశాలు కల్పించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన నేపధ్యంలో తమ భవిష్యత్‌ ఏంటని ప్రశ్నిస్తున్నారు భారతీయ మెడికల్ విద్యార్థులు. ఉక్రెయిన్‌, రష్యా మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపధ్యంలో అక్కడ ఉన్న భారతీయులందరినీ దేశం విడచి వెంటనే వెళ్లిపోవాలని అక్టోబర్‌ 19న ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.


దీంతో ఏం చేయాలో ఆర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు భారతీయ విద్యార్ధులు. ఇండియాకు వస్తే వైద్యపట్టాతోనే వస్తామని లేదంటే చావైనా.. రేవైనా ఉక్రెయిన్‌లోనే తేల్చుకుంటామని అంటున్నారు.

మరోవైపు నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ -2019 ప్రకారం ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు భారతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించలేమని సెప్టెంబర్‌లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇటువంటి సడలింపులు ఇవ్వడంతో దేశంలో మెడికల్‌ స్డాండర్డ్స్‌ తగ్గిపోతాయంటూ సుప్రీం కోర్టుకు క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం..


దీంతో ఇండియాకు తిరిగి వచ్చిన మెడికల్‌ స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై కేంద్రం చేతులెత్తేయంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది

ఇక మెడికల్ కాలేజీ దగ్గర స్టూడెంట్స్‌ హాస్టళ్లను టార్గెట్‌ చేస్తూ రోజూ ఐదు నుంచి ఏడు ఎయిర్ సైరన్‌లు వినిపిస్తున్నాయని, స్టూడెంట్స్‌ అధిక ధరలకు ఆహారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో తమకు వేరే ఆప్షన్‌ లేదని ఉక్రెయిన్‌లోని మెడికల్‌ స్టూడెంట్స్‌ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story