USA : భారతీయ విద్యార్థినిపై పిడుగు

USA : భారతీయ విద్యార్థినిపై పిడుగు
20 నిమిషాల పాటు ఆగిన గుండె.. బ్రెయిన్ డ్యామేజ్.

పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురైంది. స్నేహితులతో పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా యువతిపై పిడుగు పడింది. దీంతో ఊహించని పరిణామంతో ఒక్కసారిగా షాక్ అయిన బాధితురాలు తేరుకొనేలోపే పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది. ఈ క్రమంలో సుమారు 20 నిమిషాల పాటు గుండె లయతప్పడంతో మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది.

భారత్ కు చెందిన సుశ్రూణ్య కోడూరుయూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చేస్తోంది. జులై మొదటివారంలో ఆమె తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులోని ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. పరిస్థితి విషమంగా ఉందని ఆమెకు సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుటున్నారు.



ప్రకృతిలో జరిగే మార్పులు మనిషి చేతిలో లేని వ్యవహారం. అది విసిరే సవాళ్లను ముందుజాగ్రత్తలతో తప్పించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ప్రస్తుత ఆధునిక కాలంలో అలా పిడుగుపాట్ల రూపంలో ప్రకృతి పెద్ద సవాళ్లనే విసురుతోంది. ఇటీవల కాలంలో నమోదవుతున్న పిడుగుపాటు మరణాల గణాంకాలే ఇందుకు నిదర్శనం.

సాధారణంగా పిడుగుపాట్లు వర్షాకాలంలో ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఒక్కోసారి వేసవిలో కురిసే ఆకస్మిక వరదల సమయంలోనూ పడుతుంటాయి. వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా ఇవి ఏర్పడుతుంటాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువుండే రుణావేశిత మేఘాలు కిందకు చేరుకుంటాయి. ధనావేశిత మేఘాలు చాలా పైకి చేరుకున్నపుడు దగ్గరలో ఉన్న పదార్థం వైపునకు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దీనినే పిడుగుపాటుగా పిలుస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే వాతావరణంలోని మేఘాలు, గాలి, భూమి మధ్య విద్యుత్తు ప్రవహించడాన్నే పిడుగులుగా పరిగణిస్తారు. అలాఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు, మెరుపులు ఏర్పడుతుంటాయి.

Tags

Next Story