అంతర్జాతీయం

దుబాయ్ వ్యాపారి సహృదయం.. ఉద్యోగుల భార్యలకూ వేతనం

కోవిడ్ సంక్షోభంలో చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులనే బలి చేస్తున్నాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ

దుబాయ్ వ్యాపారి సహృదయం.. ఉద్యోగుల భార్యలకూ వేతనం
X

యూఏఈ: ఏదైనా సంస్థ తమ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకే ఒకటికి రెండు సార్లు లెక్కలు వేసుకుంటుంది. ఖర్చును తగ్గించుకునేందుకు తర్జనభర్జనలు పడి అవసరం అయితే..ఉద్యోగుల సంఖ్యను కూడా కుదిస్తుంది. ఇక ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులనే బలి చేస్తున్నాయి.

ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ షార్జాలోని ఓ వ్యాపారి తమ ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు వేతనంతో పాటు ఇక నుంచి వారి భాగస్వామికి కూడా సాధారణ వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఆయన మన భారతీయ వ్యాపారవేత్త కావటం విశేషం. పేరు డా.సోహన్ రాయ్. తన ఎరిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కోవిడ్ సమయంలోనూ సంస్థ పట్ల చూపించిన చిత్తశుద్ధికి ఫిదా అయ్యారు సోహన్ రాయ్. అందుకే ప్రతి ఉద్యోగి భాగస్వామికి కూడా గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారాయన. దీనికి సంబంధించి ఇప్పటికే తమ ఉద్యోగుల భాగస్వామ్యుల వివరాలను కంపెనీ వర్గాలు సేకరిస్తున్నాయి.

Next Story

RELATED STORIES