బాత్‌రూమ్ కిటికీ నుంచి పురిటి బిడ్డను బయటకు విసిరి..

అమెరికాకు చెందిన 23 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ అమానుషంగా ప్రవర్తించింది. తనకు పుట్టిన బిడ్డను బాత్‌రూమ్ కిటి్కీలో నుంచి బయటకు విసిరేసింది. తీవ్రంగా గాయపడ్డ ఆ పసిబిడ్డ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దాంతో ఈ దారుణానికి పాల్పడిన భారత మహిళపై హత్యాయత్నం కేసు నమోదైంది.
న్యూయార్క్ లోని క్వీన్స్ లో నివాసం ఉండే సబితా దుకాం స్నానికని బాత్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఊహించని ఈ పరిణామానికి షాకైన సబిత వెంటనే పసికందును బాత్‌రూం కిటికీలోంచి బయటకు విసిరేసింది. అనంతరం బాత్‌రూమ్‌ని శుభ్రం చేసి స్నానం చేసి వెళ్లి పడుకుంది. అయితే పసికందు ఏడుపు విన్న ఇరుగు పొరుగు వారు వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. తీవ్ర గాయాలతో ఉన్న పసికందును ఆస్పత్రిలో జాయిన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల విచారణలో సబిత.. తాను స్నానం చేస్తుండగా బాబు బయటకు రావడంతో ఏం చేయాలో తెలియలేదని, భయంతో బయటకు విసిరేసినట్లు చెప్పింది. ఐదుఅడుగుల ఎత్తునుంచి బాబు కింద పడడంతో పసిగుడ్డుకు దెబ్బలు బాగా తగిలాయి. మెదడులో రక్తస్రావం కావడంతో వాపు కూడా వచ్చింది. ప్రస్తుతం పసికందు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com