Abu Dhabi Big Ticket: భారతీయ ట్రక్ డ్రైవర్ అదృష్టం.. అబుదాబీ లాటరీ టికెట్ లో ఊహించని ప్రైజ్ మనీ..

Abu Dhabi Big Ticket: భారతీయ ట్రక్ డ్రైవర్ అదృష్టం.. అబుదాబీ లాటరీ టికెట్ లో ఊహించని ప్రైజ్ మనీ..
Abu Dhabi Big Ticket: ఆర్థిక అవసరాలు తీరాలని అయినవాళ్లందర్నీ వదిలేసి అబుదాబీ వెళ్లాడు.. అక్కడ ట్రక్ డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించాడు ముజీబ్ చిరతోడి.

Abu Dhabi Big Ticket: ఆర్థిక అవసరాలు తీరాలని అయినవాళ్లందర్నీ వదిలేసి అబుదాబీ వెళ్లాడు.. అక్కడ ట్రక్ డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించాడు ముజీబ్ చిరతోడి. లాటరీ ద్వారా 12 మిలియన్ దిర్హామ్‌ల (రూ. 24,82,63,972) గ్రాండ్ ప్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఇది అతడి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు అని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ముజీబ్. డ్రాలో మెగా ప్రైజ్ విజేత ముజీబ్ చిరతోడి. మరో 10 మంది స్నేహితులతో కలిసి ముజీబ్ పేరు మీద లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు.

ఎనిమిది మంది ప్రవాసుల బృందం టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి ముజీబ్ కు డబ్బులు అందించారు. తనకు డబ్బు చాల అవసరం కావడంతో ఏడాది కాలంగా టిక్కెట్టు కొనుగోలు చేస్తున్నానని గల్ఫ్ న్యూస్ కు వివరించాడు ముజీబ్. అజ్మాన్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ ముజీబ్ ఇంత డబ్బు గెలిచానంటే నమ్మలేకపోతున్నానని అన్నాడు.

ముజీబ్ ఏప్రిల్ 22న ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. రంజాన్ చివరి 10 రోజులలో తన ప్రార్థనలకు ప్రైజ్ మనీతో సమాధానం లభించిందని అతను బలంగా విశ్వసిస్తున్నాడు.

మెగా రాఫిల్ లాటరీ టిక్కెట్ ధర 500 దీరమ్ లు. బిగ్ టికెట్, UAEలో ఎక్కువ కాలం నడిచే అతిపెద్ద రాఫిల్ డ్రా. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ ఐన్ విమానాశ్రయం, ఆన్‌లైన్‌లో www.bigticket.aeలో నిర్వహించబడుతుంది.

"మిలియన్ దిర్హామ్ నగదు బహుమతితో ఈ లాటరీ టికెట్ నిర్వహణ ప్రారంభించబడినది. సంవత్సరాలు గడిచేకొద్దీ క్రమంగా వృద్ధి చెందింది. ఇప్పుడు బిగ్ టికెట్ 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రైజ్‌ మనీ కూడా 20 మిలియన్ దిర్హామ్‌ల వరకు పెరిగింది అని లాటరీ నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story