Pakistan Anju : పాక్ నుంచి భారత్‌కు రానున్న అంజు

పాకిస్థాన్ దేశానికి వెళ్లి అక్కడి ఫేస్‌బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ భారతదేశానికి రానుంది. తన ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ఫేస్‌బుక్ స్నేహితుడి కోసం పాకిస్థాన్ దేశానికి వెళ్లిన అంజూ అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. ఆమే తాజాగా భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఎన్‌వోసీ పత్రం కోసం ఇస్లామాబాద్‌లోకి హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె భర్త (పాకిస్తాన్ భర్త ) నస్రుల్లా తెలిపారు. నిరభ్యంతర పత్రం రాగానే అంజు భారత్‌కు వస్తారని వెల్లడించారు.
రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన 34 ఏళ్ల అంజు రాజస్థాన్‌కు చెందిన అర్వింద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే, అంజూకు పాకిస్థాన్‌కు చెందిన 29 ఏండ్ల నస్రుల్లాతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారితీయడంతో అతడి ప్రేమ కోసం భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి.. ఈ ఏడాది జూలైలో వాఘా సరిహద్దు గుండా పాక్‌లోకి ప్రవేశించింది. అక్కడ తన ప్రియుడు నస్రుల్లాను కలిసింది. అక్కడి నుంచి ఖైబర్ ఫంఖ్తుఖ్వా లోని ప్రియుడి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఆ తర్వాత ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. ఆ జంటకు అక్కడ పాక్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని మొహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమి, నగదును కానుకగా అందజేశాడు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో అప్పర్ దిర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరూ నివసిస్తున్నారు. తాను కొన్ని పాష్తో పదాలు నేర్చుకున్నానని, పాక్‌లో ఇంత పేరు వస్తుందని ఇక్కడికి రాకముందు తనకు తెలియదని అంజూ చెప్పారు. ఈ క్రమంలో ఆమెకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏడాది చెల్లుబాటయ్యే వీసాను మంజూరు చేసింది. అంజూకి రాజస్థాన్‌లో ఉండే అరవింద్‌తో ఇంతకు ముందు పెళ్లయింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. వారిని చూడతానికే ఇప్పుడు అంజు భారత్ కు వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com