ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య
టైగర్ ఫోర్స్ చీఫ్ ను కాల్చి చంపిన దుండగులు

మన దేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ ను కెనడాలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలో ఉన్న సర్రే సిటీలోని ఒక గురుద్వారా సాహిబ్ ప్రాంగణం లోనే అగంతకులు ఈ దాడికి పాల్పడ్డారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, గురు నానక్ సిక్ - గురుద్వారా సాహిబ్ అధిపతి అయిన హర్దీప్ పై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. టైగర్ ఫోర్స్ సభ్యుల కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నాడన్న అరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియలో ఖలిస్తాన్ మద్దతుదారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇతని హస్తం ఉంది. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్ధ తరఫున కెనడాలో ప్రత్యేక ఖలిస్తానీ దేశం కోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిలో హర్దీప్ నిజ్జార్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ సంస్ధ ఇప్పటికే కెనడాతో పాటు పలు దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయాలతో పాటూ పలు సంస్ధల్ని టార్గెట్ చేస్తోంది. హర్దీప్ సామాజిక మాధ్యమాల్లో కూడా విద్వేషపూరిత ప్రసంగాలు చిత్రాలు ఉన్నట్టుగా గుర్తించారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హర్దీప్ నిజ్జార్ పేరు కూడా ఉంది. 2022లోనే నిజ్జార్ పై జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ జలంధర్ లో హిందూ పూజారిని కాల్చిచంపిన కేసు నమోదు చేయడంతో పాటు ఆయన్ను పట్టించిన వారికి రూ.10 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇతనిపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జలంధర్ లోనే బహర్ సింగ్ కూడా అనే గ్రామానికి చెందిన ఇతని భూమిని కూడా ప్రభుత్వం సీజ్ చేయటంతో కుటుంబ సభ్యులు సొంత గ్రామం విడిచి వెళ్లిపోయారు.

అయితే కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ మద్దతుదారులైన సిక్కులకు మద్దతిస్తుందన్న వార్తల నేపథ్యంలో అక్కడ ఆశ్రయం పొందుతున్న నిజ్జార్ ఇవాళ హత్యకు గురికావడం సంచలనం రేపింది. పంజాబ్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజ్జర్‌పై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను భారత్ ఇప్పటికే కోరింది

Tags

Read MoreRead Less
Next Story