Indonesia: జకార్తాలో భారీ అగ్నిప్రమాదం..17 మంది మృతి

Indonesia: జకార్తాలో భారీ అగ్నిప్రమాదం..17 మంది మృతి
X
52 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్‌ సిబ్బంది

ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇంధన నిల్వ డిపోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనలో 17 మంది మృతి చెందగా.. 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 52 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Tags

Next Story