వణికించిన రంగు వరదలు..రక్తపు వర్షం కురుస్తోందంటూ సోషల్‌ మీడియాలో వదంతులు

వణికించిన రంగు వరదలు..రక్తపు వర్షం కురుస్తోందంటూ సోషల్‌ మీడియాలో వదంతులు
X
అయితే ఆ నీరంతా ఎర్ర రంగులో ఉండడంతో అంతా మొదట భయపడ్డారు.

ఇండోనేసియాలో వచ్చిన రంగు వరదలు జనాన్ని అశ్చర్యంలో ముంచెత్తాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలతో జెంగోగోట్‌ గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టింది. అయితే ఆ నీరంతా ఎర్ర రంగులో ఉండడంతో అంతా మొదట భయపడ్డారు.

రక్తపు వర్షం కురుస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున పుకార్లు వ్యాపించాయి. అయితే అంతలోనే అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న వస్త్ర పరిశ్రమల నుంచి అద్దకం రంగు వరదనీటిలో కలిసిందని తెలిసింది. దీనివల్లే వరద ఎర్రగా మారిందని తేలడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.


Tags

Next Story