Ibu volcano: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం

Ibu volcano: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం
X
5 కి.మీ ఎత్తుకు బూడిద..

ఇండోనేషియాలో మరో అగ్నిపర్వతం బద్ధలైంది. హల్‌మహెరా ద్వీపంలో ఉన్న ఇబు అగ్నిపర్వతం మళ్లీ పేలింది. అగ్ని పర్వతం నుంచి బూడిద ఆకాశంలో 5కి.మీ వరకు ఎగిసిపడింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11:36 గంటలకు విస్ఫోటనం ప్రారంభమై రెండు నిమిషాలు సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతం ఇటీవల కాలంలో మరింత క్రియాశీలకంగా మారిందని, దాని ప్రమాదకర లెవల్ మూడు నుంచి నాలుగుకి మారింది. అగ్నిపర్వతం సమీపంలో డేంజర్ జోన్‌లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మూడు రోజుల క్రితం ఇండోనేషియాలోని సెమెరు అగ్ని పర్వతం కూడా బద్ధలైంది. తూర్పు జావాలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఒకే రోజు 5 సార్లు విస్పోటనం చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియాలోనే అత్యధికి క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూఅంతర్భాగంలో అత్యంత క్రియాశీలకంగా ఉండే పసిఫిక్ మహాసముద్రంలో ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ అనే భాగంలో ఉంది. ఈ ప్రాంతంలో భూమి అడుగున టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎక్కువగా ఉండటంతో పాటు అనేక సంఖ్యలో అగ్నిపర్వతాలను కలిగి ఉంటుంది. భూ అంతర్భాగంలో జరిగే చర్యల వలన ఇక్కడి అగ్నిపర్వతాలు బద్ధలవుతుంటాయి.

అంతకు ముందు నెల రోజుల క్రితం ఇండోనేషియాలో రువాంగ్‌ అగ్నిపర్వతం నుండి రాళ్లు, లావా, బూడిద వెదజల్లడంతో అప్రమత్తమైన అధికారులు సమీపంలోని వందలాది మంది ప్రజలను ఖాళీ చేయించి ఏకంగా విమానాశ్రయాన్ని కూడా మూసివేసారు. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రాంతంలో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది.

అప్పట్లో హైరిస్క్‌ ఉన్న ప్రాంతాల్లో సుమారు 1, 500 మందిని తరలించాల్సి వుందని, సుమారు 12,000 మంది ప్రభావితమౌతారని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పలు విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.

Tags

Next Story