దేవుడా.. భర్తకు విడాకులిచ్చి.. కొడుకును పెళ్లి చేసుకుని గర్భం దాల్చి..

దేవుడా.. భర్తకు విడాకులిచ్చి.. కొడుకును పెళ్లి చేసుకుని గర్భం దాల్చి..
తప్పు ఒప్పులు తాతలకొదిలి.. సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి.. అన్నీ వదిలేసి వాళ్లకి నచ్చింది చేసేస్తున్నారు..

తప్పు ఒప్పులు తాతలకొదిలి.. సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి.. అన్నీ వదిలేసి వాళ్లకి నచ్చింది చేసేస్తున్నారు.. ఎవరేమనుకుంటే నాకేంటి.. ఎవరితో అయినా నాకు పనేంటి అని వావి వరుసలు మరుస్తున్నారు. తాజాగా రష్యా క్రాస్నోదర్ క్రై ప్రాంతానికి చెందిన మెరీనా బల్మాషెవా (35) తన మాజీ భర్త అలెక్సీ (45)కి విడాకులిచ్చి, కుమారుడు వ్లాదిమర్ వోయాను పెళ్లి చేసుకుని గర్భం దాల్చి బిడ్డను కనబోతోంది.

మెరీనా.. అలెక్సీని వివాహం చేసుకునే నాటికే అతడికి కొడుకు వ్లాదిమర్ ఉన్నాడు. పది సంవత్సరాలకు పైగా ఆ జంట కలిసే ఉన్నారు. మెరీనా.. వ్లాదిమర్‌ని బాగా చూసుకోవడంతో వాళ్లిద్దరి మధ్య అనుబంధం బలపడింది. అనంతర పరిణామాల కారణంగా మెరీనా, అలెక్సీలు విడాకులు తీసుకున్నారు.

కానీ వ్లాదిమర్.. మెరీనాను విడిచి ఉండలేకపోయాడు.. ఆమె పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. తమ ఇద్దరిదీ సాధారణ బంధం కాదని తెలుసుకున్నారు. వివాహం అనే బంధంతో తమ సంబంధాన్ని ముడివేయాలనుకున్నారు. మరుక్షణం ఇద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇప్పుడు మెరీనా ఎనిమిది నెలల గర్భవతి. మెరీనాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 5,26,000 మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మెరీనా నలుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూస్తోంది. నా కొత్త భర్తతో నా భవిష్యత్ బావుంటుందని ఆశిస్తున్నాను. మేము ఇప్పుడు అన్నింటినీ పంచుకుంటాము. అతడు కెరీర్‌లో ఎదిగేందుకు దిశా నిర్ధేశం చేస్తాను. మాకు సంతానం ఉంటుంది. బహుశా, ఒకరి కంటే ఎక్కువ ఉండొచ్చనుకుంటున్నాను అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది మెరీనా.

Tags

Next Story