Instant Noodles: ఉడుకు ఉడుకు నూడుల్స్ తో జర భధ్రం

భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు అందరికీ అత్యంత ప్రీతికరమైన ఆహార పదార్ధం ఏమిటంటే నూడుల్స్ అని ఠక్కున చెప్పేస్తారు. అత్యంత సులభంగా చేయగలిగే ఇన్స్టాంట్ నూడుల్స్ ను చిన్నా పెద్దా అందరూ ఇష్టపడతారు. ఇక తక్కువ సమయంలో వండి పెట్టగలిగే సులభమైన వంటకం కావడంతో అమ్మలు కూడా ఎప్పుడంటే అప్పుడు హాయిగా వండి వార్చేస్తున్నారు. అయితే అంతగా ఆదరణ పొందిన ఈ వంటకం చిన్నారుల పాలిట శాపంగా మారుతోందా? అంటే నిజమేనని ఒప్పుకోవాల్సిందే! ఇక్కడ చెప్పుకోవాల్సింది నూడుల్స్ తినడం వల్ల కలిగే దుష్ఫ్రభావాల గురించి కాదు. వేడివేడి నూడుల్స్ వల్ల జరుగుతున్న ప్రమాదాల గురించి.
వేడివేడిగా నూడుల్స్ లాగించేస్తే ఆ కిక్కే వేరు అనుకుంటే సరిపోదు. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఇటీవలే చికాగో విశ్వవిద్యాలయం ప్రచురించిన బర్న్ అనే నివేదిక ప్రకారం చిన్నతంలో కాలిన గాయాలకు గురవుతున్న వారిలో నూడుల్స్ ప్రధాన కారణమని స్పష్టం చేసింది. గత పదేళ్లళో అంటే 2010 నుంచి 2020 వరకూ కాలిన గాయాలతో ఆసుపత్రిపాలైన చిన్నారుల నివేదిక పరిశీలించగా 790కేసుల్లో, 245 కేసులు నూడుల్స్ వద్ద కలిగినవేనని స్పష్టం అయింది. ఈ లెక్కలు వైద్యలునే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇన్స్టెంట్ నూడుల్స్ వల్ల ఇన్ని ప్రమాదాలు చేటుచేసుకుంటున్నాయని ఊహించలేదని చెబుతున్నారు.
అయితే నూడుల్స్ ను వేడి చేసేటప్పుడే సెకండ్ లేదా థర్డ్ డిగ్రీ బర్న్స్ అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఈ ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువ అని తెలిపారు. చిన్నారుల్లో చర్మం సున్నితంగా ఉండటం వల్ల సులభంగా గాయపడతారని తెలిపారు. మరోవైపు నూడల్స్ వండేటప్పుడు అందులోని స్టార్చ్ వాటర్ వల్ల దానికదే మండే అవకాశం ఉందని చెప్పారు. తమ నూడుల్స్ ను స్వయంగా వండుకుంటున్నాప్పుడు, పెద్ద వాళ్ల పర్యవేక్షణ లేకపోవడం వల్ల 40శాతం మంది ఇలాంటి ప్రమాదాల బారిన పడ్డారని తెలిపారు. ముఖ్యంగా 4-5ఏళ్ల లోపు చిన్నారులు తమకు తాముగా అన్నీ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com