Omicron Covid Variant : ఒమిక్రాన్‌ పుట్టుకపై ఆసక్తికర విషయాలు

Omicron Covid Variant : ఒమిక్రాన్‌ పుట్టుకపై ఆసక్తికర విషయాలు
Omicron Covid Variant : సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్‌ సామర్థ్యంపై భిన్న కథనాలు, వార్తలు వస్తున్న వేళ.. ఈ వేరియంట్‌ పుట్టుక పైనా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Omicron Covid Variant : కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్‌ సామర్థ్యంపై భిన్న కథనాలు, వార్తలు వస్తున్న వేళ.. ఈ వేరియంట్‌ పుట్టుక పైనా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా ప్రమాదకరమైన వేరియంట్లలో ఒక్కటైన డెల్టా కంటే మూడు రెట్లు బలమైన ఒమిక్రాన్‌.. అసలు మనుషుల్లోనే పుట్టలేదనే విశ్లేషణ బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అనేక ఆధారాలను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ మనుషుల్లో కాకుండా జంతువుల్లో వృద్ధి చెంది ఉండొచ్చని మొదటి నుంచి భావిస్తున్న శాస్త్రవేత్తలు.. ఎలుకల్లో ఇది పరిమాణక్రమం చెందినట్లు బలంగా నమ్ముతున్నారు. తాజా రీసెర్చ్‌ ప్రకారం.. కోవిడ్‌ కారక సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ మనుషుల్లో నుంచి ఎలుకల్లోకి ప్రవేశించింది. దీన్ని రివర్స్‌ జూనోసిస్‌ అంటారు. ఇలా ప్రవేశించిన వైరస్‌ అనేక పరివర్తనాలు చెంది.. తిరిగి మనుషుల్లోకి ప్రవేశించి ఉండొచ్చన్నది తాజా రీసెర్చ్‌ రిపోర్ట్‌.

చాలా కాలం కిందటనే ఇతర వేరియంట్లకు భిన్నంగా ఒమిక్రాన్‌ రూపాంతరం చెందిందని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇదే తమ వాదనకు బలమైన ఆధారం అంటున్నారు స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఇమ్యునాలజిస్ట్స్‌. ఎలుకల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే ఏడు రకాల పరివర్తనాలు ఒమిక్రాన్‌ ఉన్నాయని గుర్తించారు. ఆల్ఫా వంటి రకాల్లో ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అయితే దానికి దాదాపుగా సరితూగుతోంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ పరివర్తనం చెంది ఉండొచ్చన్న కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటి కంటే రివర్స్‌ జూనోసిస్‌, జూనోసిస్‌కే ఎక్కువ ఆస్కారం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎలుకల్లోనే ఒమిక్రాన్‌ పరిమాణక్రమం చెందిందన్న స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ వాదనకే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు మద్దతిస్తున్నారు. కొత్త వేరియంట్‌లో ఉన్న పరివర్తనలు చాలా అసాధారణంగా ఉంటం కూడా వీటిని బలం చేకూరుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story