International: సింగపూర్ లో ఉగ్ర కలకలం
అత్యంత శుభ్రమైన నగరంగా పేరుగాంచిన సింగపూర్ లో ఉగ్ర కలకలం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. దేశంలో పలు చోట్ల దాడులకు యత్నిస్తున్న ఉగ్ర పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు ఓ 18ఏళ్ల విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ లోనే మహమ్మద్ ఇర్ఫాన్ దన్యాల్ బిన్ మొహమ్మద్ నూర్ అనే సింగపూర్ విద్యార్ధిని అంతర్గత భధ్రతా యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. సదరు యువకుడు ఐఎస్ మద్దతుదారుడని, దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ స్థాయిలో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నడాని వెల్లడైంది. ఆత్మాహుతి దళం ద్వారా మిలిటరీ క్యాంప్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సింగపూర్ న్యాయ, భద్రతా శాఖా మంత్రి కె. షణ్ముగం వెల్లడించారు. ఆన్ లైన్ లో ఐఎస్ భావజాలానికి ఆకర్షితుడైన మహమ్మద్ సోషల్ మీడియా ద్వారా ఓ దళాన్ని తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. 2020లో ఇదే విధంగా సింగపూర్ లోని రెండు మసీదులపై దాడి చేసేందుకు 16ఏళ్ల కుర్రాడు ప్రయత్నించాడని, న్యూజిలాండ్ లోని మసీద్ పై జరిగన దాడి నుంచి స్ఫూర్తి పొందాడని షణ్ముగం ఈ సందర్భంగా గుర్తుచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com