International : మూడవ బిడ్డకు జన్మనిచ్చిన జూకర్ బర్గ్

ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మార్క్ జూకర్ బర్గ్ - ఫ్రిసిల్లా చాన్ దంపతులు మూడవ బిడ్డకు జన్మనిచ్చారు. శుక్రవారం రాత్రి బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. "ప్రపంచానికి స్వాగతం, అరేలియా చాన్ జుకర్ బర్గ్" అని పోస్ట్ చేశారు. జూకర్ బర్గ్ తన బిడ్డతో నవ్వూతూ ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటో షేర్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో శుభాకాంక్షలు తెలిపారు నెటిజన్లు.
జూకర్ బర్గ్ - ఫ్రిసిల్లా చాన్ 2012లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడేళ్ల మాక్సిమా, ఐదు సంవత్సరాల ఆగస్టు తో పాటు ఇప్పుడు మరో పాప. జూకర్ బర్గ్ - ఫ్రిసిల్లా చాన్ కాలేజీ నుంచి ప్రేమలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మొదటిసారి ఒక పార్టీలో కలుసుకున్నారు. మే 19 2012న పెళ్లి చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

