International: మస్క్‌ మామే నెంబర్‌ 1...

International: మస్క్‌ మామే నెంబర్‌ 1...
X
ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో టెస్లా, ట్విట్టర్ షేర్లు భారీగా పతనమై మొదటి స్థానాన్ని కోల్పోయిన మస్క్ 2 నెలల తర్వాత మళ్లీ అపర కుబేరుడిగా నిలచారు. 187.1 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానంలో నిలిచినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకటించింది.

ఎలాన్ మస్క్ తర్వాత రెండోస్థానంలో బెర్నాల్డ్ అర్నాల్డ్ నిలిచారు. బెర్నాల్డ్ సంపద 185.7 బిలియన్ డాలర్లని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మూడోస్థానంలో ఉండగా.. ఒరాకిల్ సహ వ్యవస్థాపకులు లారి ఎల్లిసన్ నాలుగోస్థానంలో నిలిచారు. ఇక భారత్ నుంచి ముకేష్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలవగా.. గౌతమ్ అదానీ 37.7 బిలియన్ డాలర్లతో 32వ స్థానానికి పడిపోయారు.

Tags

Next Story