International: నోబెల్ గ్రహీతకు 10 సంవత్సరాల జైలు శిక్ష

నోబెల్ బహుమతి గ్రహీత అలెస్ బిలియాట్స్కీకి బెలారస్ 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. బెలారస్ మానవహక్కుల ఉద్యమకారుడు, 2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన బియాలియాట్ స్కీకి బెలారస్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న వియస్నా మానవ హక్కుల సంస్ధ బెలారస్‌లో పౌరహక్కుల కోసం పోరాడుతోంది. దేశాధ్యక్షుడిగా అలెగ్జాండర్ లుకాషెంకో ఎన్నికైనప్పుడు బెలారస్‌లో అల్లర్లు చెలరేగాయి. అధ్యక్షుడికి వ్యతిరేకంగా బియాలియాట్ స్కీ,ఆయన సహచరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. లుకాషెంకో పౌర భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనీ, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనీ ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు.
అయితే ఆ నిరసనల్లో పాల్గోన 35 వేలమందిని ప్రభుత్వం అరెస్టుచేసింది. రష్యా సహకారంతో, లుకాషెంకో ప్రతిపక్ష ఉద్యమాన్ని గట్టిగా అణిచివేసాడు.నిరసన కారులను జైలులో పెట్టారు.అప్పట్లో అరెస్టయిన బియాలియాట్ స్కీ,ఆయన బృందం గత 21 నెలలుగా జైలులోనే ఉన్నారు. వారందరినీ ప్రస్తుతం కోర్టు ముందు హాజరుపరచగా వీరికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com