అంతరిక్ష కేంద్రంలో భారీ కుదుపు..అరగంట పాటు..

అంతరిక్ష కేంద్రంలో భారీ కుదుపు..అరగంట పాటు..
International Space Station:అంతరిక్ష కేంద్రంలో అరగంట పాటు యుద్ధం జరిగింది. రష్యా పంపించిన మాడ్యుల్ కారణంగా ISS ఓవైపుకి తిరిగిపోయింది.

International Space Station: అంతరిక్ష కేంద్రంలో అరగంట పాటు యుద్ధం జరిగింది. రష్యా పంపించిన మాడ్యుల్ కారణంగా ISS ఓవైపుకి తిరిగిపోయింది. ఆ సమయంలో స్పేస్‌ స్టేషన్‌కు, నాసాకు మధ్య సమాచార వ్యవస్థ కూడా తెగిపోయింది. ఓవైపు స్పేస్‌ స్టేషన్‌ ఒరిగిపోతుండడంతో అందులో ఉన్న వ్యోమగాములు అరగంట పాటు కంగారుపడ్డారు. చివరికి స్పేస్‌ స్టేషన్, నాసా మధ్య కమ్యూనికేషన్ సెట్‌ అవడంతో ISSను యథాతథ స్థితికి తీసుకురాగలిగారు. లేదంటే, గ్రావిటీ సినిమానో, స్టార్‌వార్స్‌ సినిమానో కనిపించేది.

నాకా పేరుతో రష్యా ఓ మాడ్యుల్‌ను ఐఎస్‌ఎస్‌కు పంపించింది. స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లిన మాడ్యుల్‌ దానంతట అదే ISSకు అనుసంధానం అవ్వాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల కారణంగా ఆ వ్యవస్థ విఫలమైంది. దీంతో వ్యోమగాములే మాన్యువల్‌గా మాడ్యుల్‌ను అనుసంధానం చేశారు. ఇది జరిగిన కాపేపటికే రష్యా మాడ్యుల్‌లోని థ్రస్టర్లు మండడం మొదలుపెట్టాయి. దీంతో ISSపై ఒకవైపు ఒత్తిడి కలిగించడంతో స్పేషన్‌ స్టేషన్ అదుపు తప్పి, ఓవైపుకి వంగిపోయింది. ఈ విషయం నాసాకు చేరే సరికి పావుగంట పట్టింది. అప్పటికే, స్పేస్ స్టేషన్‌ 45 డిగ్రీలు వంపు తిరిగింది.

వెంటనే స్పందించిన నాసా శాస్త్రవేత్తలు.. స్పేస్‌ స్టేషన్‌కు మరో అంచున ఉన్న థ్రస్టర్లను మండించి, ఒత్తిడి పెంచారు. రష్యా మాడ్యుల్ ఒత్తిడి పెంచుతున్న ప్రతిసారి, మరో అంచున ప్రెషర్ పెంచారు శాస్త్రవేత్తలు. ఈ సమయంలో రష్యా మాడ్యుల్‌కు, స్పేస్ స్టేషన్‌కు మరో అంచున ఉన్న మాడ్యుల్‌కు మధ్య యుద్ధం జరిగినట్టుగా పరిస్థితి మారింది. స్పేస్ స్టేషన్‌ను మామూలు స్థితికి తీసుకురావడానికి దాదాపు అరగంట పట్టింది.

ఈ ఘటన జరిగేప్పుడు మాడ్యూల్‌లో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. ఈ సమయంలో స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న వ్యోమగాములకు, నాసా శాస్త్రవేత్తలకు మధ్య కమ్యూనికేషన్‌ రెండుసార్లు తెగిపోయింది. ఒకవేళ నాసా శాస్త్రవేత్తలు స్పందించడానికి మరో 12 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పూర్తిగా తిరగబడేది. అదే జరిగి ఉంటే.. సోలార్‌ ప్లేట్లకు సూర్యకాంతి తగలక పవర్‌ జనరేషన్ ఆగిపోతుంది. స్పేస్ స్టేషన్ లోపల ఉన్న వ్యవస్థలన్నీ ఆగిపోతాయి. నాసాకు, స్పేస్ స్టేషన్‌కు మధ్య కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోతుంది.

కాని, నాసా శాస్త్రవేత్తలు వెంటనే స్పందించడం, ఒరిగిన ISSను యథాస్థానానికి తీసుకురావడంతో పెనుముప్పు తప్పింది. ఒకవేళ అలాంటి ప్రమాదమే జరిగి ఉన్నా.. వ్యోమగాములకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని నాసా తెలిపింది. స్పేస్‌ స్టేషన్‌లో ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే.. అక్కడ నుంచి భూమికి రావడానికి ఒక క్యాప్సూల్‌ను పార్క్‌ చేసి ఉంచారు. ఆ క్యాప్సుల్ ద్వారా భూమిని చేరుకోవచ్చు.

రష్యా పంపించిన మాడ్యుల్‌పై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. నాకాను అంతరిక్షంలోకి ప్రయోగించే ముందే కొన్ని సమస్యలు తలెత్తాయి. స్పేస్‌ స్టేషన్‌కు చేరాక సరిగ్గా అనుసంధానం అవుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. అయినప్పటికీ అంతరిక్షంలోకి పంపించారు. తీరా అక్కడికి వెళ్లాక.. ఆటోమేటిక్‌గా జరగాల్సిన వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి. థ్రస్టర్లు వాటంతట అవే మండాయి. చివరికి ప్రయోగానికి ముందు అనుమానించినట్టే ప్రమాదం కూడా జరిగింది. దీనిపై త్వరలోనే సమీక్షిస్తామని రష్యా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story